PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-you-do-not-agree-we-will-return-the-awards6b1b0304-5970-496f-bcfd-9777a167253d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-you-do-not-agree-we-will-return-the-awards6b1b0304-5970-496f-bcfd-9777a167253d-415x250-IndiaHerald.jpgవ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. వివిధ రాజకీయ పక్షాలతో పాటు పలువురు ప్రముఖులు కూడా రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రేపు జరిగే భారత్‌ బంద్‌తో రైతుల ఉద్యమం.. మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. if you do not agree we will return the awards;choudary actor;hari;hari music;delhi;capital;minister;congress-ncp;central government;partyఒప్పుకోకపోతే అవార్డులు తిరిగిచ్చేస్తాం..!ఒప్పుకోకపోతే అవార్డులు తిరిగిచ్చేస్తాం..!if you do not agree we will return the awards;choudary actor;hari;hari music;delhi;capital;minister;congress-ncp;central government;partyMon, 07 Dec 2020 17:00:00 GMT
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 12వ రోజుకు చేరింది. చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్రం వినతులను పట్టించుకోవడం లేదు. కొన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తున్నా.. చట్టాలను రద్దు చేసేంతవరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు కదంతొక్కుతున్నారు. అన్నదాతలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో రేపు చేపట్టబోయే భారత్‌ బంద్‌కు  రైతన్నలు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రైతులకు మద్దతు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో ఆందోళన చేస్తామని ప్రకటించింది. బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌, డీఎంకే, ఆప్‌ తదితర పార్టీలు ప్రకటించాయి. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాలు  రైతుల ఆందోళనకు మద్దతునిస్తున్నాయి.

రైతులు తలపెట్టిన ఆందోళనకు 10 ట్రేడ్‌ యూనియన్లు సంఘీభావం ప్రకటించగా.. బ్యాంక్‌ యూనియన్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన అంశాన్ని వీలైనంత త్వరగా కేంద్రం పరిష్కరించాలని ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్‌ పవార్‌ కేంద్రానికి సూచించారు. లేకుంటే ప్రస్తుతం దేశ రాజధాని వరకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళన దేశ నలుమూలలకూ విస్తరిస్తుందని హెచ్చరించారు. అయితే, చట్టాలను తాము ఏమాత్రం వెనక్కి తీసుకోబోమని కేంద్రం చెబుతోంది. రైతుల అభ్యంతరాల మేరకు సవరణలు చేస్తామే తప్ప.. చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోబోమని ఆ శాఖ సహాయమంత్రి కైలాష్‌ చౌదరి అన్నారు. రాజకీయ పార్టీలతో పలువురు క్రీడాకారులు, సినీ ప్రముఖులు కూడా రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే.. తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తామని ఇప్పటికే పలువురు క్రీడాకారులు హెచ్చరించారు. 


ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>