PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/power-bill-changes-in-andhra-pradesh41419b76-c01a-4b04-97c6-bfdf1dd97f2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/power-bill-changes-in-andhra-pradesh41419b76-c01a-4b04-97c6-bfdf1dd97f2b-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావంతో విద్యుత్ సంస్థలు భారీ ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని గాడిలో పెట్టాలంటే విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా ఈ ఏడాది భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సంక్షోభంలో విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కూడా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతోనే విys jagan;vidya;jagan;andhra pradesh;2019;chief minister;electricity;minister;aqua;ycp;reddyఏపీలో ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెరుగుదల ఎంతంటే..?ఏపీలో ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెరుగుదల ఎంతంటే..?ys jagan;vidya;jagan;andhra pradesh;2019;chief minister;electricity;minister;aqua;ycp;reddyMon, 07 Dec 2020 11:00:00 GMTవిద్యుత్ సంస్థలు భారీ ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని గాడిలో పెట్టాలంటే విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా ఈ ఏడాది భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సంక్షోభంలో విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కూడా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతోనే రాష్ట్ర ప్రజలపై చార్జీల భారం మోపకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బాలినేని. ఇందులో భాగంగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో డిస్కంలకు రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు మంత్రి బాలినేని. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. ఈ నిధులన్నిటినీ ఎప్పటికప్పుడు విద్యుత్ సంస్థలకు కేటాయిస్తూ వాటిపై భారం పడకుండా చేస్తున్నామని అన్నారాయన.

ఇక గృహ విద్యుత్‌ వినియోగదారులకు వైసీపీ ప్రభుత్వం రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు మంత్రి బాలినేని. చౌక విద్యుత్‌ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నూతన విధానాలను అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ, మున్సిపల్‌ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్‌ లైన్‌మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సంస్థల పనితీరు మెరుగుపడిందని అధికారులంటున్నారు. ఈ దఫా ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకుంటున్నట్టు స్పష్టం చేశారు.




నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

కేజీఎఫ్2 ఫస్ట్ పార్ట్ అంత మ్యాజిక్ చేస్తుందా?

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>