PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-full-clarity-on-nimmagada-1f32ce94-a58e-4e64-a17e-ffaa1679bec3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-full-clarity-on-nimmagada-1f32ce94-a58e-4e64-a17e-ffaa1679bec3-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైసీపీ, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ముందుకెళుతుంది. కరోనా సమయంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని వైసీపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం లేదని చెబుతున్నారు. kodali nani;nani;kumaar;kodali nani;jagan;andhra pradesh;high court;minister;war;tdp;local language;ycp;election commissionనిమ్మగడ్డ విషయంలో కొడాలికి ఫుల్ క్లారిటీ ఉందిగా...!నిమ్మగడ్డ విషయంలో కొడాలికి ఫుల్ క్లారిటీ ఉందిగా...!kodali nani;nani;kumaar;kodali nani;jagan;andhra pradesh;high court;minister;war;tdp;local language;ycp;election commissionMon, 07 Dec 2020 04:00:00 GMTవైసీపీ, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ముందుకెళుతుంది. కరోనా సమయంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని వైసీపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం లేదని చెబుతున్నారు.

అలాగే దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. నిమ్మగడ్డ టీడీపీ మనిషి అని మొదటి నుంచి వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి అనుకూలంగా నిర్వహిస్తారని చెబుతున్నారు. అందుకే నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి వైసీపీ సిద్ధపడటం లేదు.

అయితే ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఎన్నికలు వద్దనడానికి కారణాలు పరోక్షంగా చెప్పేస్తున్నారు. మార్చిలో నిమ్మగడ్డ రిటైర్ అయిపోతారు. అందుకే ఆయన రిటైర్ అయ్యాక, కొత్త ఎలక్షన్ కమిషనర్ వచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటుంది. అప్పుడే తమకు అనుకూలంగా ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు. కొడాలి నాని కూడా అదే విషయంపై క్లారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే వచ్చే వేసవి కాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని కుండబద్దలు కొట్టారు. కాకపోతే కరోనా అనే అంశాన్ని ముందుపెట్టుకుని ఎన్నికలు వద్దని మరికొందరు వైసీపీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ కొడాలి నాని మాత్రం పక్కాగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికలు పెట్టమని చెప్పేస్తున్నారు. ఏదేమైనా నిమ్మగడ్డ విషయంలో కొడాలికి ఫుల్ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా నిమ్మగడ్డ, కొడాలి ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా. అందుకే నిమ్మగడ్డ విషయంలో కొడాలినే ముందు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జమ్మలమడుగులో ఇంకా ఛాన్స్ లేదా?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>