PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgభారత వ్యవసాయ విధానానికి అనుగుణంగా రైతు ఉత్పత్తుల వర్తక వాణిజ్య సాధికారత బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ,వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చింది అని ఆయన పేర్కొన్నారు. రైతు ఉత్పత్తులు తమకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన రేటుకు అమ్ముకునే వీలుంది అన్నారు. రైతులు,నిపుణులు,రాజకీయ పక్షాల నుంచి అkishan reddy;g kishan reddy;congress;parliment;job;minister;vegetable market;central government;punjab;reddy;partyరైతులు అక్కడే గొడవ చేస్తున్నారు: కిషన్ రెడ్డిరైతులు అక్కడే గొడవ చేస్తున్నారు: కిషన్ రెడ్డిkishan reddy;g kishan reddy;congress;parliment;job;minister;vegetable market;central government;punjab;reddy;partyMon, 07 Dec 2020 20:00:00 GMTపార్లమెంట్ లో ఆమోదం పొందింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ,వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చింది అని ఆయన పేర్కొన్నారు. రైతు ఉత్పత్తులు తమకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన రేటుకు అమ్ముకునే వీలుంది అన్నారు.

రైతులు,నిపుణులు,రాజకీయ పక్షాల నుంచి అనేక సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ ఇదిఅన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం చట్టాలు ఉపయోగపడతాయి అని ఆయన చెప్పుకొచ్చారు. రైతు తన పంటకు లాభం పొందే మార్కెట్లో పంట అమ్ముకునే వ్యవస్థను కొత్త చట్టాల ద్వారా కేంద్రం కల్పించింది అన్నారు. రైతులు మార్కెట్ యార్డులో,బయట, స్టోర్ చేసుకుని పంటలు అమ్మవచ్చు అని ఆయన చెప్పారు. రైతుల పంటలను కొనుగోలు చేసే వారిలో పోటీతత్వం పెంచేలా కేంద్రం తీసుకువచ్చిన చట్టం ఉంది అన్నారు.

రైతు ప్రయోజనాలకు,సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది అని స్పష్టం చేసారు. కేంద్రం పై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న నిరసనలు రాజకీయ పరమైనవి అని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలతో నిరసనలు చేస్తున్నారు అన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఆందోళనలు చేస్తున్నారు అని, రైతుల మంచి కోసం చట్టాలు తెస్తే వాటిని వ్యతిరేకిస్తున్నారు అని ఆయన అన్నారు. పంజాబ్ మినహా సామాన్య రైతులు ఆందోళన చేయడం లేదు అని, కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా రైతులకు చేసింది ఏమి లేదు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి సంబంధించి ఏరోజు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోలేదు అని మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు పధికాలను టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని విమర్శించారు.


కొత్త పీసీసీ చీఫ్ ఎవరో తెలుసా..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>