MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alia-bhat-joins-rrr-movie-shooting38f32d32-a2da-43e5-ad93-663b5213b1e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alia-bhat-joins-rrr-movie-shooting38f32d32-a2da-43e5-ad93-663b5213b1e2-415x250-IndiaHerald.jpgరాజమౌళి తెరకెక్కిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో నటి అలియా భట్ జాయిన్ అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలియా చేస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా సెట్స్ కు అలియాని ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు ఈ చిత్ర సభ్యులు.alia bhatt;ntr;alia bhatt;jr ntr;rajamouli;seetha;hyderabad;gujarat - gandhinagar;ram madhav;rrr movie;cinema;smart phone;twitter;letter;nandamuri taraka rama rao;pune;indian;research and analysis wingఅలియా ఆగయాఅలియా ఆగయాalia bhatt;ntr;alia bhatt;jr ntr;rajamouli;seetha;hyderabad;gujarat - gandhinagar;ram madhav;rrr movie;cinema;smart phone;twitter;letter;nandamuri taraka rama rao;pune;indian;research and analysis wingMon, 07 Dec 2020 15:59:00 GMT

రాజమౌళి తెరకెక్కిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో నటి అలియా భట్ జాయిన్ అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలియా చేస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా సెట్స్ కు అలియాని ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు ఈ చిత్ర సభ్యులు.

అలియా హైదరాబాద్ కు సోమవారం నాడు వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో అలియాకు చెందిన ఫోటోలు వైరల్ అయ్యాయి. విశ్వసనీయత వర్గాల ప్రకారం, రెండు వారాలలో అలియా ఈ సినిమాకి సంబందించిన తన వర్క్ ని పూర్తి చేస్తుంది. ఈ సినిమాలో రాంచరణ్ కు జోడీగా అలియా నటిస్తోంది. రాంచరణ్, అలియా భట్ మొదటిసారి ఈ సినిమాలో స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. అందిన సమాచారం ప్రకారం అలియా ఈ సినిమాలో 'సీత' పాత్రలో నటిస్తోంది.

ఇటీవల కాలంలోనే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ మళ్ళీ మొదలయింది. రాంచరణ్, తారక్ పై లేటెస్ట్ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించింది ఈ సినిమా బృందం. ఈ షెడ్యూల్ 50 రోజుల పాటు కొనసాగింది. ఈ పూర్తి యాక్షన్ సీక్వెన్సుకి నైట్ ఎఫెక్ట్ ఉండేటట్టు చిత్రీకరించారని తెలుస్తోంది. అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో గుజరాత్, పూణే, హైదరాబాద్ లలో మార్చిలోనే జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ, షూటింగ్ పోస్ట్ ఫోన్ అవడంతో అలియా భట్ మళ్ళీ అధికంగా డేట్స్ ఇవ్వవలసి వచ్చింది. 

ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా కథ విషయానికొస్తే స్వాతంత్రం రాక ముందు 1920వ సమయానికి చెందిన ఒక కల్పిత కథ ఇది. అల్లు సీతారామరాజు, కొమరం భీం జీవితాలపై కాస్త కల్పనతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సంవత్సరం విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేసింది ఈ సినిమా బృందం. ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ బాగుందని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలెబ్రిటీలు, అభిమానులు అభినందనలు కురిపించారు. 




బ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>