MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreya-sarancde3f26b-a867-4114-9b98-02f9168d98e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreya-sarancde3f26b-a867-4114-9b98-02f9168d98e7-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లతో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. 'బాహుబలి' సిరీస్ తరువాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్టు ఎలా ఉంటుందా అని ఆసక్తి నెలకొన్న సమయంలో రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన చేశారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్టు గురించి అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి.sreya saran;ntr;prabhas;ajay devgn;alia bhatt;ajay;bharani;jr ntr;rahul new;rahul;rajamouli;tanikella bharani;k l rahul;india;ram madhav;rrr movie;cinema;bahubali;rahul sipligunj;letter;nandamuri taraka rama rao;romantic;chatrapathi;research and analysis wing;samuthirakani;ray stevenson;chitramఆర్ ఆర్ ఆర్ లో శ్రేయ పాత్రపై ఉత్కంఠ...ఆర్ ఆర్ ఆర్ లో శ్రేయ పాత్రపై ఉత్కంఠ...sreya saran;ntr;prabhas;ajay devgn;alia bhatt;ajay;bharani;jr ntr;rahul new;rahul;rajamouli;tanikella bharani;k l rahul;india;ram madhav;rrr movie;cinema;bahubali;rahul sipligunj;letter;nandamuri taraka rama rao;romantic;chatrapathi;research and analysis wing;samuthirakani;ray stevenson;chitramMon, 07 Dec 2020 10:30:49 GMT

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లతో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. 'బాహుబలి' సిరీస్ తరువాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్టు ఎలా ఉంటుందా అని ఆసక్తి నెలకొన్న సమయంలో రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన చేశారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్టు గురించి అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి.

ఈ సినిమాలో శ్రేయ శరన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. శ్రేయ ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులో తానూ ఓ భాగం అని చెప్పిందో అప్పటి నుంచి శ్రేయ పాత్ర పైనా ఎంతో ఇంటరెస్ట్ నెలకొంటు  వస్తోంది అభిమానులలో. దాంతో శ్రేయ పాత్ర ఈ సినిమాలో ఇలా ఉంటుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం శ్రేయ ఇందులో ఒక అతిథి పాత్రలో కనిపించబోతోంది. ముప్పై ఎనిమిది సంవత్సరాల శ్రేయ తొందరలోనే ఈ సినిమా షూటింగ్ కు జాయిన్ కాబోతోంది. ప్రస్తుతం బార్సిలోనాలో తన భర్తతో కలిసి ఉంటోంది. ఈ సినిమాలో శ్రేయ పాత్రకు ఎటువంటి రొమాంటిక్ సాంగ్స్ కానీ సన్నివేశాలు గానీ ఉండవని సమాచారం. 'ఆర్ ఆర్ ఆర్'లో శ్రేయ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. శ్రేయ ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛత్రపతి' చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నటించింది. 

ఇదిలా ఉంటే, మరిన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసే ఆలోచనలో శ్రేయ ఉన్నట్టు వినికిడి. ఇంకా శ్రేయ 'గమనం' అనే సినిమాలో కూడా నటిస్తున్నట్టు న్యూస్. 'గమనం'లో శ్రేయ ఒక గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా తనికెళ్ళ భరణి ప్రాజెక్టులో కూడా శ్రేయ నటించనుంది. 

ఇక 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయానికొస్తే, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసిన్ డూడీ, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. 




పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>