Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna871bf93d-95d2-429e-bf9b-0c6ad163f22b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna871bf93d-95d2-429e-bf9b-0c6ad163f22b-415x250-IndiaHerald.jpg‘చూడు.. ఒకవైపే చూడు... రెండో వైపు చూడాలనుకోకు.. మాడిపోతావ్. మసైపోతావ్..!’ ఇలాంటి డైలాగ్‌లు బాలకృష్ష నోటి వెంట వింటే ఆ పవరే వేరు. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లుకు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి నటసింహం బాలకృష్ష ముందుకెళుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలకృష్ణకు మరో రెండు...balakrishna;balakrishna;shriya;boyapati srinu;geetha;nayantara;thaman s;cinema;sangeetha;dance;hero;nandamuri taraka rama rao;legend;simha;v;kavuru srinivas;mass;chitramబాలయ్య కోసం రెడీ అవుతోన్న రెండు కథలు.. పాన్స్‌కు పండగే!బాలయ్య కోసం రెడీ అవుతోన్న రెండు కథలు.. పాన్స్‌కు పండగే!balakrishna;balakrishna;shriya;boyapati srinu;geetha;nayantara;thaman s;cinema;sangeetha;dance;hero;nandamuri taraka rama rao;legend;simha;v;kavuru srinivas;mass;chitramSat, 05 Dec 2020 12:05:33 GMTఇంటర్నెట్ డెస్క్: ‘చూడు.. ఒకవైపే చూడు... రెండో వైపు చూడాలనుకోకు.. మాడిపోతావ్. మసైపోతావ్..!’ ఇలాంటి డైలాగ్‌లు బాలకృష్ష నోటి వెంట వింటే ఆ పవరే వేరు. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లుకు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి నటసింహం బాలకృష్ష ముందుకెళుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలకృష్ణకు మరో రెండు కథలూ రెడీగా ఉన్నాయట. వెండితెరపై డైలాగులు, డ్యాన్సుల విషయంలో ఆయన ఎక్కడా తగ్గరు. ప్రస్తుతం వరుస సినిమాలనూ ఒప్పుకుంటూ వెళుతున్నారు. మంచి కథలతో దర్శకులు సిద్ధంగా ఉండాలే గానీ వరుసపెట్టి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా.. అభిమానులను మాత్రం కొత్త సినిమాలతో అలరించేందుకు వెనుకాడడం లేదు.

బాలకృష్ణను మల్టీస్టారర్ సినిమాలో చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. అయితే ఆశ త్వరలో తీరేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బాలకృష్ణ కోసం సిద్ధమైన కథల్లో ఒకటి మల్టీస్టారర్ చిత్రమట. ఈ కథను ఓ కొత్త దర్శకుడు బాలకృష్ణకు వినిపించాడట. ఇందులో బాలకృష్ణతో పాటు, యంగ్ హీరో నాగశౌర్యను తీసుకోనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరో కథనూ బాలకృష్ణ విన్నారట.

ఆ సినిమాకు ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కథను సంతోష్‌ శ్రీనివాస్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు, అందులోనూ బాలకృష్ణతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు కథలకు బాలయ్య పచ్చజెండా ఊపితే బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులుండవు. మరి బాలయ్య ఏమంటారో..? చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ముచ్చటగా మూడో సారి బోయపాటి కాంబోలో నటిస్తున్నాడు. గ‌తంలో బాలయ్య-బోయపాటి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ మాస్ చిత్రాలు వ‌చ్చాయి. ఇప్పుడు రాబోతోంది మూడో సినిమా. విశేషమేమిటంటే ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా చెప్పారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేకాదు.. ఈ మూవీ టైటిల్ కూడా కన్ఫామ్ అయిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘మోనార్క్’ అనే టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్లో నమోదు కూడా చేశారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార, శ్రియ, నమితల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరి పేరును ఫైన‌ల్ చెయ్య‌లేదు. ప్ర‌స్తుతం మంచి జోరుమీదున్న‌ తమన్ ఈ చిత్రానికి‌ సంగీతం అందిస్తున్నారు. మ‌రి తాజా మూవీతో వీరిద్ద‌రూ హ్యాట్రిక్ కొడ‌తారో, లేదో చూడాలి.


'ఆచార్య' విలేజ్ సెట్ అదరహో

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>