EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-bjp-shocks-kcr-unexpectedly-in-ghmc-elections2fc4b41c-bda8-43f9-b229-2c5ee9bd91e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-bjp-shocks-kcr-unexpectedly-in-ghmc-elections2fc4b41c-bda8-43f9-b229-2c5ee9bd91e4-415x250-IndiaHerald.jpgమొన్నటి దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో మంచి ఊపుమీదున్న బీజేపీకి వెంటనే గ్రేటర్ ఎన్నికలు రావటం బాగా కలిసొచ్చింది. తనకు ఎదురే ఉండకూడదని కేసీయార్ అనుకుంటున్న సమయంలో కచ్చితంగా తామే కేసీయార్ కు ప్రత్యామ్నాయంగా ఉంటమానే నమ్మకాన్ని కమలంపార్టీ జనాల్లో కల్పించింది. అందుకనే జనాలంతా టీడీపీ, కాంగ్రెస్ ను వదిలేసి కమలంపార్టీని పట్టుకున్నారు. నిజానికి తెలంగాణాలో గడచిన ఆరేళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేసిందంటే అది బీజేపీ మాత్రమే అని చెప్పాలి. టీడీపీ నేల మట్టమైపోయిన కారణంగా ఆ పార్టీని ఎవరు పట్టించుకోkcr telangana ghmc elections bjp mim congress trs;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;government;lotus;tdp;central government;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ కు ఊహించని షాకిచ్చిన కమలంపార్టీహెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ కు ఊహించని షాకిచ్చిన కమలంపార్టీkcr telangana ghmc elections bjp mim congress trs;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;government;lotus;tdp;central government;partySat, 05 Dec 2020 05:00:00 GMTగ్రేటర్ ఫలితాలు కేసీయార్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లే ఉంది. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 56కి మాత్రమే పరిమితమైంది. అంటే ఏకంగా 43 డివిజన్లు కారు పార్టీ నుండి జారిపోయాయి. మరి టీఆర్ఎస్ కోల్పోయిన డివిజన్లన్నీ ఎవరికి దక్కాయి ? ఎవరికంటే బీజేపీనే గెలుచుకున్నది. 46 డివిజన్లలో బీజేపీ అదరగొట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఇన్ని డివిజన్లను గెలుచుకుంటుందని కేసీయార్ ఏమాత్రం ఊహించుండరు. అందుకనే తాజా ఎన్నికల్లో 104 డివిజన్లలో గెలిచి తీరుతామని పదే పదే చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే కొత్తవి గెలుచుకోవటం కాదు కదా ఉన్నవి కూడా జారిపోయాయి. కేటీయార్ తన ప్రచారంలో గల్లీ బాయ్స్ కావాలా ? లేకపోతే ఢిల్లీ బాయ్స్ కావాలా ? తేల్చుకోమని అన్నందుకు జనాలు తమకు ఢిల్లీ బాయ్సే కావాలని కోరుకున్నట్లు అర్ధమైపోయింది. అందుకనే నాలుగు డివిజన్ల నుండి ఏకంగా 46 డివిజన్లలో బీజేపీని గెలిపించారు.




మొన్నటి దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో మంచి ఊపుమీదున్న బీజేపీకి వెంటనే గ్రేటర్ ఎన్నికలు రావటం బాగా కలిసొచ్చింది. తనకు ఎదురే ఉండకూడదని కేసీయార్ అనుకుంటున్న సమయంలో కచ్చితంగా తామే కేసీయార్ కు ప్రత్యామ్నాయంగా ఉంటమానే నమ్మకాన్ని కమలంపార్టీ జనాల్లో కల్పించింది. అందుకనే జనాలంతా టీడీపీ, కాంగ్రెస్ ను వదిలేసి కమలంపార్టీని పట్టుకున్నారు. నిజానికి తెలంగాణాలో గడచిన ఆరేళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేసిందంటే అది బీజేపీ మాత్రమే అని చెప్పాలి. టీడీపీ నేల మట్టమైపోయిన కారణంగా ఆ పార్టీని ఎవరు పట్టించుకోవటం లేదు. అలాగే కాంగ్రెస్ నేతల్లో ఇంకా లోపాయికారీగా చాలామంది కేసీయార్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారనే జనాలు నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కు మద్దతిచ్చినా ఉపయోగం ఉండదని అర్ధమపోయింది. అందుకనే కేసీయార్ పాలనపై పోరాటాలు చేస్తున్న బీజేపీకే జనాలు మద్దతిచ్చారు. ఇందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిపించారు. ఈ మధ్య దుబ్బాక లో గెలిపించారు. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీని 49 డివిజన్లలో గెలిపించారు.



 


ఇంత వేగంగా బీజేపీ పుంజుకుంటోంది అంటే అర్ధం కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత బలపడుతోందనే. కేసీయార్ కు తమ ఓట్లను ఎవరికి వేయాలని అనుకున్నపుడు జనాలకు బీజేపీ మాత్రమే కనబడుతున్నది. అందుకనే కమలంపార్టీ తొందరగా బలం పుంజుకుంటోంది. బీజేపీ ఇంతలా బలం పుంజుకుంటుందని బహుశా కేసీయార్ తో పాటు కేటీయార్, సీనియర్ నేతల్లో ఎవరూ ఊహించుండరు. తనకు ఎదురన్నదే లేకుండా చేసుకోవాలన్న ఆలోచనతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను నేలమట్టం చేసిన ఫలితమే ఇపుడు బీజేపీ బలంగా తయారవ్వటం.  కేంద్రంలో బీజేపీ అధికారంలో బలంగా ఉండటం కూడా తెలంగాణాలో కమలంపార్టీకి బాగా కలిసి వస్తోంది. ఇదే సమయంలో బండి సంజయ్ లాంటి దూకుడు స్వభావం ఉండే ఎంపి అధ్యక్షునిగా ఉండట కూడా పార్టీకి బాగా కలిసొస్తోంది. మొత్తం మీద కేసీయార్ కు బీజేపీ ఊహించని షాక్ ఇచ్చిందనే అర్ధమైపోతోంది.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>