PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war86a66eb6-7848-4768-b617-a052bd44c7f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war86a66eb6-7848-4768-b617-a052bd44c7f0-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో సునాయాసంగా 100 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. వాటిలో దాదాపు సగం సీట్లు మాత్రమే గెలిచింది. దీనిపై మాజీ ఎంపీ విజయ శాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచిన టీఆర్ఎస్, ఈసారి 43 స్థానాలు కోల్పోయి 56 స్థానాలకే పరిమితం అయిందని ఆమె ఎద్దేవా చేశారు. greater-war;vijayashanti;hyderabad;telangana rashtra samithi trs;mp;aqua;mim party;party;mantraగ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలుగ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలుgreater-war;vijayashanti;hyderabad;telangana rashtra samithi trs;mp;aqua;mim party;party;mantraSat, 05 Dec 2020 00:45:00 GMTటీఆర్ఎస్ పార్టీ.. వాటిలో దాదాపు సగం సీట్లు మాత్రమే గెలిచింది. దీనిపై మాజీ ఎంపీ విజయ శాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచిన టీఆర్ఎస్, ఈసారి 43 స్థానాలు కోల్పోయి 56 స్థానాలకే పరిమితం అయిందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మళ్లీ జట్టు కడతాయంటూ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గ్రేటర్ ఫలితాలపై తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఆమె స్పందించారు.


ఆమె ఏమన్నారంటే.. ‘‘కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆరెస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గులాబీ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారు. విపక్షాలకు అవకాశమివ్వకూడదనే కుట్రతో... వరుస సెలవులున్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసీ... రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాల్లో తప్పుల సవరణకు సమయం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, మృతుల పేర్లు జాబితాల్లో దర్శనమిచ్చాయి. అనుభవం లేని సిబ్బందితో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపేశారు. కాస్త తక్కువ స్థానాలు దక్కినా మేయర్ పదవికి అండగా ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయని టీఆరెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆరెస్‌కి మేయర్ సీటు దక్కేలా లేదు. ఇన్నాళ్ళూ కవలల్లా ఉంటూ వచ్చిన ఈ పార్టీలకు కమల పరీక్ష ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరం లేదని టీఆరెస్ నేతలు... తల్చుకుంటే గులాబీ సర్కారును 2 నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారు. మేయర్ పీఠం విషయంలో ఇద్దరూ అదే మాటమీద ఉంటారా? కాదంటే... మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని... హంగ్ కార్పోరేషన్ రానివ్వండి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమని టీఆరెఎస్ చెప్పాలి. కవలల అసలు రంగు బయటపడే సమయం ఇప్పుడు ఆసన్నమైంది’’ అని విజయశాంతి తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.


రివర్స్ అయిన టీడీపీ...ఆ విషయంలో వైసీపీ బుక్ అయినట్లేనా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>