MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family674c9071-8041-42b1-a139-bfd9426f91f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family674c9071-8041-42b1-a139-bfd9426f91f8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అరవై పదుల వయసులో కూడా చిరూ వరుస సినిమాలతో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. పేరుకే సీనియర్ హీరో అయిన మెగాస్టార్.. యువ హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమాలతో బిజీ గా ఉండే చిరూ.. సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుగ్గాmega family;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;ram pothineni;tollywood;rrr movie;cinema;media;lord siva;wife;hero;instagram;yuva;father;vసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ ఫ్యామిలీ ఫోటో..!!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగాస్టార్ ఫ్యామిలీ ఫోటో..!!mega family;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;ram pothineni;tollywood;rrr movie;cinema;media;lord siva;wife;hero;instagram;yuva;father;vSat, 05 Dec 2020 18:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అరవై పదుల వయసులో కూడా చిరూ వరుస సినిమాలతో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. పేరుకే సీనియర్ హీరో అయిన మెగాస్టార్.. యువ హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమాలతో బిజీ గా ఉండే చిరూ.. సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుగ్గా ఉంటాడు. తనకు నచ్చిన విషయాలపై స్పందిస్తూ, వ్యకిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే చిరంజీవి..

తాజాగా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆమె భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కుమార్తెలు సుస్మిత,శ్రీజలున్నారు. ఈ ఫోటోను సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో ఉంది. ఈ ఫోటోను మెగాభినులు తెగ షేర్ చేస్తున్నారు.ప్రస్తుతం చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు తొలిసారి పూర్తి స్థాయిలో తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో కలిసి నటిస్తున్నాడు.ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బ్యాక్స్ అనే బ్యానర్ స్థాపించి వరుసగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌లో భాగంగా 'షూటౌట్ అట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిరంజీవి కెమియో రోల్ చేసినట్టు సమాచారం. ఇలా మొత్తం మీద చిరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ... ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన ఫొటోలతో మెగా ఫ్యాన్స్ కి కనువిందు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య షూటింగ్ చివర దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి... సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు...!!


అక్కడి నుండి ఎవడైనా కొడతాడు .... కానీ ఇక్కడి నుండి కొట్టేవాడే నిజమైన హీరో ....??

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??

“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>