Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/post-office43a754b0-761e-4ea3-a69b-78edcdc7d10f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/post-office43a754b0-761e-4ea3-a69b-78edcdc7d10f-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు అన్ని రకాల బ్యాంకులు తమ కస్టమర్లకు తక్కువ చార్జీలతో మెరుగైన సర్వీసులను అందించాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది కస్టమర్లను ఆకర్షించాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా అన్ని బ్యాంకులు చార్జీల పెంపు చేస్తూ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం కస్టమర్ల నుంచి ఎన్నో రకాల ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రస్తుతం బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. దీంతో అన్ని బ్యాంకుల కస్టమర్లు పెరిగిన ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం తెలిసిందే. అంతేకాదు అకౌంట్లో మినిమం బాలన్స్post office;amala akkineni;india;rbi;media;december;september;customer;officeబ్యాంకుల బాటలో పోస్ట్ ఆఫీసులు.. కస్టమర్లకు భారీ షాక్..?బ్యాంకుల బాటలో పోస్ట్ ఆఫీసులు.. కస్టమర్లకు భారీ షాక్..?post office;amala akkineni;india;rbi;media;december;september;customer;officeSat, 05 Dec 2020 11:00:00 GMT


 ఒకవేళ అకౌంట్లో మినిమం బాలన్స్ లేకపోయినా మళ్లీ చార్జీలు చెల్లించక తప్పదు అంటూ నిబంధన పెడుతున్నాయి.  ఇలా బ్యాంకులు తెరమీదకు తెస్తున్న సరి కొత్త నిబంధనలతో ప్రస్తుతం బ్యాంకు కస్టమర్లందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు కూడా తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఇండియా పోస్ట్ కూడా మినిమం బాలెన్సు రూల్స్ సవరించింది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగిన వారిపై ఇటీవలే ఇండియా పోస్ట్  తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అకౌంట్లో మినిమం బాలన్స్ లిమిట్ ని  500 రూపాయలకు పెంచనున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది.


 ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది ఇండియా పోస్ట్. లేనిపక్షంలో ఛార్జీలు తప్పవు  అంటూ తమ కస్టమర్లను హెచ్చరించింది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ప్రస్తుతం సవరించిన కొత్త మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ అమలులోకి వస్తాయని ఇండియా పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తప్పనిసరిగా మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుడు 500 మినిమం బాలన్స్  డిసెంబర్ 11 నాటికల్లా ఉండేలా చూసుకోవాలని సూచించింది. లేదంటే ఛార్జీలు చెల్లించక తప్పదు అంటూ హెచ్చరించింది. ఒకవేళ డిసెంబర్ 12 నాటికి సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బాలన్స్ 500 కలిగి ఉండకపోతే 100 రూపాయల చార్జీలు వేస్తామని ఇండియా పోస్ట్ తెలిపింది. అకౌంట్ లో ఎలాంటి బ్యాలెన్స్ లేకపోతే ఇక అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అంటూ చెప్పింది.


బాలీవుడ్‌లో బాపూబొమ్మ.. బిజీ బిజీ...!

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>