PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pawan-kalyanf6bb834b-6e33-47c7-8144-358861366289-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pawan-kalyanf6bb834b-6e33-47c7-8144-358861366289-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటనలో దొంగల చేతివాటంతో జనసైనికులు లబోదిబోమన్నారు. చిత్తూరు జిల్లానుంచి పవన్ నెల్లూరు జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారీ ర్యాలీ తీశారు. మనుబోలు సమీపంలో పవన్ కి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల సెల్ ఫోన్లు, పర్స్ లు దొంగతనానికి గురయ్యాయి. పవన్ ర్యాలీలో కలసిపోయిన పిక్ పాకెటర్లు చేతివాటం చూపడంతో జనసైనికులు, పవన్ అభిమానులు లబోదిబోమన్నారు. pawan kalyan;pawan;manu;pawan kalyan;district;nellore;police;media;partyపవన్ వస్తున్నాడంటే దొంగలకు పండగే..పవన్ వస్తున్నాడంటే దొంగలకు పండగే..pawan kalyan;pawan;manu;pawan kalyan;district;nellore;police;media;partySat, 05 Dec 2020 07:00:00 GMTపవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటనలో దొంగల చేతివాటంతో జనసైనికులు లబోదిబోమన్నారు. చిత్తూరు జిల్లానుంచి పవన్ నెల్లూరు జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారీ ర్యాలీ తీశారు. మనుబోలు సమీపంలో పవన్ కి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల సెల్ ఫోన్లు, పర్స్ లు దొంగతనానికి గురయ్యాయి. పవన్ ర్యాలీలో కలసిపోయిన పిక్ పాకెటర్లు చేతివాటం చూపడంతో జనసైనికులు, పవన్ అభిమానులు లబోదిబోమన్నారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ ర్యాలీల సమయంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇతర పార్టీల నాయకులు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఇలాంటి చోరీలు బైటపడినా.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ర్యాలీలంటేనే దొంగలు పండగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు అందరూ యువతే. పవన్ కల్యాణ్ కనపడ్డారంటే ఒక్కొకరికి పూనకాలే. ఒళ్లు తెలియకుండా మైమరచిపోయి పవన్ ని చూస్తుండిపోతారు. సెల్ఫీలకోసం ట్రైచేస్తుంటారు, ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సాహమే దొంగలకు కలిసొస్తోంది. అందుకే పవన్ పర్యటనల్లోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

అయితే నెల్లూరులో జిల్లాలో జరిగిన చోరీ ఘటనపై పవన్ అభిమానులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మీడియా ముందు తమ బాధ చెప్పుకున్నారు కానీ, సమస్యను పెద్దది చేసి పవన్ టూర్ ని ఓ సమస్యగా చిత్రీకరించే ఉద్దేశం తమకి లేదని అంటున్నారు అభిమానులు. పవన్ టూర్ అంటే పోలీసులు కూడా ఆయన్ని చూడటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. రోప్ పార్టీ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో పవన్ ని సెల్ ఫోన్లలో బంధించడానికి, ఆయనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. పవన్ పై అందరికీ ఉన్న అభిమానం, ఆయన్ని చూడాలనే ఆత్రుతే వీరికి పెట్టుబడి. అందరూ పవన్ ధ్యాసలో ఉంటే.. దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళ్తున్నారు.


ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>