PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war18473c10-1b58-47b9-b8df-f601bfb99d7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war18473c10-1b58-47b9-b8df-f601bfb99d7e-415x250-IndiaHerald.jpgహోరాహోరీగా జరిగిన గ్రేటర్ ఎన్నికల పోరులో టిఆర్ఎస్ ,బిజెపి ,ఎంఐఎం పార్టీలు దగ్గర దగ్గరగా ఫలితాలను దక్కించుకున్నాయి. ఏకపక్షంగా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గ్రేటర్ లో మేయర్ పీఠం దక్కించుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. సొంతంగా ఆ స్థానాన్ని సంపాదించుకునే అంత స్థాయిలో ఏ పార్టీ ఆధిక్యం చూపించలేకపోయింది. అయితే ఎంఐఎం, బిజెపి తో పోల్చుకుంటే టిఆర్ఎస్ కు కొద్దిగా సీట్లు ఎక్కువగా రావడంతో, ఆ పార్టీకి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం టిఆర్ఎస్ కు 54, బిజెపి 47, ఎమ్ఐఎం 42 ,కాంగ్రెస్ రెండుgreter-war ghmc mim trs;auto;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;letter;mim party;partyగ్రేటర్ యుద్ధం : హతవిధీ ..! టీఆర్ఎస్ వాళ్లను బతిమిలాడుకోవాల్సిందే ?గ్రేటర్ యుద్ధం : హతవిధీ ..! టీఆర్ఎస్ వాళ్లను బతిమిలాడుకోవాల్సిందే ?greter-war ghmc mim trs;auto;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;letter;mim party;partySat, 05 Dec 2020 02:00:00 GMTహోరాహోరీగా జరిగిన గ్రేటర్ ఎన్నికల పోరులో టిఆర్ఎస్ ,బిజెపి ,ఎంఐఎం పార్టీలు దగ్గర దగ్గరగా ఫలితాలను దక్కించుకున్నాయి. ఏకపక్షంగా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గ్రేటర్  లో మేయర్ పీఠం దక్కించుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. సొంతంగా ఆ స్థానాన్ని సంపాదించుకునే అంత స్థాయిలో ఏ పార్టీ ఆధిక్యం చూపించలేకపోయింది. అయితే ఎంఐఎం, బిజెపి తో పోల్చుకుంటే టిఆర్ఎస్ కు కొద్దిగా సీట్లు ఎక్కువగా రావడంతో, ఆ పార్టీకి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం టిఆర్ఎస్ కు 54, బిజెపి 47, ఎమ్ఐఎం 42 ,కాంగ్రెస్ రెండు స్థానాలను దక్కించుకుంది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్యా బలం 102 స్థానాలను ఎవరు స్పష్టంగా సంపాదించుకో లేకపోవడంతో, ఆ తరువాత జరగబోయే రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. 




టిఆర్ఎస్ కు 38 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నా , ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 92 దగ్గరే ఆగిపోతుంది. అంటే తప్పనిసరిగా ఎంఐఎం ను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంఐఎం పార్టీ సొంతంగా 42 స్థానాలను గెలుచుకుని సత్తా చాటుకుంది. ఆ పార్టీకి 10 మంది వరకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే మేయర్ పీఠం కోసం టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకు టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు స క్యతగా ఉంటూ వచ్చాయి. అయితే ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేయర్ పీఠాన్ని ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీ  కలిసి పంచుకున్నా,  ఈ వ్యవహారం టిఆర్ఎస్ కు కాస్త గందరగోళం కలిగించేదే. 




మతతత్వ పార్టీ అంటూ బీజేపీని టిఆర్ఎస్ విమర్శించిన నేపథ్యంలో , అదే మతతత్వ పార్టీ ఎంఐఎం తో ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు అన్ ప్రశ్నలు టిఆర్ఎస్ కు ఎదురవుతాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం మాత్రమే టిఆర్ఎస్ ను గట్టెక్కించేదిగా కనిపిస్తుండడంతో , వారిని సంప్రదించి ...వారు కోరిన డిమాండ్లు నెరవేర్చి మరీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని పరిస్థితి టిఆర్ఎస్ కు వచ్చి పడింది. మొత్తంగా ఈ వ్యవహారంలో చూసుకుంటే టిఆర్ఎస్ బిజెపి కంటే ఎంఐఎం ఇప్పుడు కీలకంగా మారింది.



ఈవారం సద్దాం హుస్సేన్ స్కిట్ అదిరిపోతుంది అంతే.. ప్రోమో వైరల్..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>