PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp-politicle-war-in-telangana-69da5fd5-8a1d-4fcd-ba59-0fcc47bd61f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp-politicle-war-in-telangana-69da5fd5-8a1d-4fcd-ba59-0fcc47bd61f8-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మరోసారి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం టిఆర్ఎస్ పార్టీ ముందుగా ఊహించినదే అయినా, అనుకున్నంత స్థాయిలో సీట్లను సంపాదించుకోలేకపోవడం ఆ పార్టీని కాస్త ఆందోళన లోకి నెట్టింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిచాము అనే ఆనందం కంటే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బిజెపి ఎదగడం, 2016 గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లకు పరిమితం అయినా, బీజేపీ ఇప్పుడు దాదాపు 50 సీట్లకు దగ్గరగా రావడం, బీజేపీకి టిఆర్ఎస్ కు మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో పాటు బిజెపి కూడgreter- war bjp trs telangana ghmc elections;auto;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;success;partyగ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ కాదు బీజేపీ ఇలా గెలిచేసినట్టే ?గ్రేటర్ యుద్ధం : టీఆర్ఎస్ కాదు బీజేపీ ఇలా గెలిచేసినట్టే ?greter- war bjp trs telangana ghmc elections;auto;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;success;partySat, 05 Dec 2020 01:00:00 GMT
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ  మరోసారి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం టిఆర్ఎస్ పార్టీ ముందుగా ఊహించినదే అయినా, అనుకున్నంత స్థాయిలో సీట్లను సంపాదించుకోలేకపోవడం ఆ పార్టీని కాస్త ఆందోళన లోకి నెట్టింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిచాము అనే ఆనందం కంటే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బిజెపి ఎదగడం, 2016 గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లకు పరిమితం అయినా, బీజేపీ ఇప్పుడు దాదాపు 50 సీట్లకు దగ్గరగా రావడం, బీజేపీకి టిఆర్ఎస్ కు మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో పాటు బిజెపి కూడా విజయానికి దగ్గర అయ్యింది . 




 టిఆర్ఎస్ పార్టీ వందకు పైగా స్థానాలను తాము సాధిస్తాము అంటూ చెబుతూ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ , కేటీఆర్ సైతం జిహెచ్ఎంసి ఎన్నికలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేశారు. అయినా 58 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. అయితే గెలిచిన ఆనందం కంటే , బిజెపి బాగా బలపడింది అనే ఆందోళన ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. కాగా బిజెపి లో మాత్రం ఎక్కడ లేని హుషారు నెలకొంది. గతంలో తాము నాలుగు స్థానాలకే పరిమితమైనా, ఇప్పుడు దాదాపు 55 స్థానాలకు చేరుకోవడం, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం, దానికి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలే నిదర్శనం అంటూ బిజెపి గొప్పగా చెప్పుకుంటోంది.



 టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయి నాయకులే కాకుండా , బిజెపి అగ్రనాయకులు అందరూ.. గ్రేటర్ లో  పర్యటించడం ఇవన్నీ,  ఆ పార్టీకి కలిసి వచ్చాయి. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంది అనే విషయం ఈ ఫలితాలతో స్పష్టం అవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి ఓడినా, ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపగలగడం టిఆర్ఎస్ కు గెలిచిన ఆనందం లేకుండా చేయడం వంటి వ్యవహారాలతో బిజెపి సక్సెస్ సాధించినట్లుగానే కనిపిస్తోంది.




రివర్స్ అయిన టీడీపీ...ఆ విషయంలో వైసీపీ బుక్ అయినట్లేనా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>