Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-praneetha-busy-in-bollywood39896dd6-da43-47e1-a5b0-42f6c7d042b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-praneetha-busy-in-bollywood39896dd6-da43-47e1-a5b0-42f6c7d042b7-415x250-IndiaHerald.jpgఅందానికీ, అభినయానికీ ఏ మాత్రం తక్కువ కాకపోయినా లక్ కలిసి రాని నటి కన్నడ భామ ప్రణీత. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో పాటు.. విష్ణు, మనోజ్, సిద్ధార్థ్ వంటి కథానాయకులతో నటించినా తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలూ అంతగా గుర్తింపు...praneetha;pawan;ntr;siddharth;ajay;bhama;kalyan;shilpa;india;bollywood;telugu;tamil;kannada;hindi;nandamuri taraka rama raoబాలీవుడ్‌లో బాపూబొమ్మ.. బిజీ బిజీ...!బాలీవుడ్‌లో బాపూబొమ్మ.. బిజీ బిజీ...!praneetha;pawan;ntr;siddharth;ajay;bhama;kalyan;shilpa;india;bollywood;telugu;tamil;kannada;hindi;nandamuri taraka rama raoSat, 05 Dec 2020 11:36:00 GMTకన్నడ భామ ప్రణీత. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో పాటు.. విష్ణు, మనోజ్, సిద్ధార్థ్ వంటి కథానాయకులతో నటించినా తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలూ అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఆమెకు ఇక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిపోయింది. అక్కడ తన లక్ పరీక్షించుకుంటోంది. అందుకోసం తెగ కష్టపడిపోతోంది. హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకోవాలని తహతహలాడుతోంది. అందులో భాగంగానే వచ్చిన ప్రతి అవకాశాన్నీ రెండు చేతులా ఒడిసిపట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకేసారి రెండు సినిమాలను ఒప్పుకుని బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినీ ఇండస్ట్రీల్లో పదేళ్లుగా ప్రయత్నించినా మంచి అవకాశాలు లభించకపోవడం ఆమె విసిగిపోయింది. అయితే ఈ బాధలో ఉన్న ఆమెకు బాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. అందులోనూ ఒకేసారి రెండు సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఎగిరి గంతేసి మరీ ముంబైకి మకాం మార్చేసింది. ఇక బాలీవుడ్‌పైనే  పూర్తిగా ఫోకస్ పెట్టాలని కూడా అనుకుంటోందట.

ప్రణీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ఆమెకు బీటౌన్‌లోనూ కొన్ని పరిచయాలున్నాయి. దీంతో ఎలాగైనా క్రేజీ ఆఫర్లు పట్టేయాలని, అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్‌తో భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా,  పరేష్ రావెల్, శిల్పా శెట్టిల హంగామా-2 చిత్రాల్లో నటించనుంది. ఈ రెండు సినిమాలలోనూ ప్రాధాన్యం గల పాత్రలలో కనిపించబోతుందట ఈ బెంగళూరు భామ. అంతేకాదు తాజాగా ప్రణీతకు మరో బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. అజయ్ దేవ్‌గణ్ పక్కన భూజ్‌లో కీలక పాత్రకే పరిమితమైన ప్రణీత.. ఈసారి అతడి సరసన హీరోయిన్‌గా నటించే ఆఫర్ చేజిక్కించుకుందట. త్వరలోనే.. అజయ్-ప్రణీత మూవీపై అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.  మరి అక్కడైనా లక్కీ గాళ్‌గా మారుతుందో లేదో చూడాలి.


జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>