Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అనూహ్యంగా వచ్చాయనే విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో మరోసారి దుబ్బాకలో సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అనిపించింది. అప్పుడు జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేవలం నాలుగు మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైన బిజెపి పార్టీ ఈసారి మాత్రం అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నలభై ఎనిమిది స్థానాలలో విజయం సాధించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కూడా సరైన మెజారిటీ రాలేదు అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంghmc;view;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;february;mim party;partyటిఆర్ఎస్కు కొత్త తలనొప్పి.. ఎంఐఎం సాయం కోరితే.. బిజెపి మరో వ్యూహం..టిఆర్ఎస్కు కొత్త తలనొప్పి.. ఎంఐఎం సాయం కోరితే.. బిజెపి మరో వ్యూహం..ghmc;view;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;february;mim party;partySat, 05 Dec 2020 13:00:00 GMTబిజెపి పార్టీ ఈసారి మాత్రం అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నలభై ఎనిమిది స్థానాలలో విజయం సాధించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కూడా సరైన మెజారిటీ రాలేదు అన్న విషయం తెలిసిందే.



 జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో 55 స్థానాల్లో విజయం సాధించి ఎక్కువ మెజారిటీ ఉన్న పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి మేయర్ పీఠం సొంతం చేసుకునేందుకు తగిన స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం  ఎలా అనే దానిపై ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అంటే మ్యాజిక్ ఫిగర్ కు 98 చేరుకోవాలి. అయితే మేయర్  ఎన్నిక కోసం ప్రస్తుతం ఫిబ్రవరి వరకు సమయం ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు పన్నుతోంది అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.



 వాస్తవంగా అయితే ప్రస్తుతం ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. ఎప్పటి నుంచో వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉంది అని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండటం వల్ల గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు.. ఈ రెండు పార్టీలు కలిసి నడిచాయి  అంటే ఇక ఈ అంశాన్ని మరింత గా ప్రజల్లోకి తీసుకెళ్లి విమర్శలు గుప్పించి టిఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అంటే పరోక్షంగా లేదా  ప్రత్యక్షంగా టిఆర్ఎస్ తప్పనిసరిగా ఎంఐఎం సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే జరిగితే బీజేపీ టీఆర్ఎస్ పై మరింత రాజకీయ దాడి చేసే అవకాశం కూడా లేకపోలేదు అని ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుంది  అన్నది చూడాలి మరి.


బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>