PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/local5f7597c4-c506-4996-8dbe-1133ebcc3e67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/local5f7597c4-c506-4996-8dbe-1133ebcc3e67-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు బాకీ ఉండిపోయాయి. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన బాకీ. నిజానికి 2018 ఆగస్ట్ నాటికి లోకల్ బాడీస్ కాలపరిమితి పూర్తి అయింది. అపుడు కొందరు ఎన్నికల కోసం కోర్టుకు వెళ్తే కచ్చితంగా మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వచ్చింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఏవో కారణాలతో ఎన్నికలకు వెళ్ళలేదు. ఇక 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. local;kumaar;jagan;2019;court;chief minister;local language;ycpఫిబ్రవరిలో లోకల్ ఫైట్ ఖాయం ?ఫిబ్రవరిలో లోకల్ ఫైట్ ఖాయం ?local;kumaar;jagan;2019;court;chief minister;local language;ycpSat, 05 Dec 2020 20:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికలు బాకీ ఉండిపోయాయి. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన బాకీ. నిజానికి 2018 ఆగస్ట్ నాటికి లోకల్ బాడీస్ కాలపరిమితి పూర్తి అయింది. అపుడు కొందరు ఎన్నికల కోసం కోర్టుకు వెళ్తే కచ్చితంగా మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వచ్చింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఏవో కారణాలతో ఎన్నికలకు వెళ్ళలేదు. ఇక 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు.

ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు పెట్టాలని జగన్ డిసైడ్ అయినా కరోనా నేపధ్యం చూపించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఇక ఈ మధ్యన ఆయన మళ్ళీ ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని ప్రొసీడింగ్ ఇచ్చారు. వాటిని నిలుపుచేయలంటూ వైసీపీ సర్కార్ తాజాగా  కోర్టుకు వెళ్ళింది. అయితే దానికి మీద స్టే ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది.

ఇక అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వం తరఫున వాదనలను మాత్రమే  కోర్టు విన్నది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజారోగ్యం తమకు ముఖ్యమని అందువల్ల కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని తన వాదనలు వినిపించింది. ఇక ఎన్నికల సంఘం ఎవరికీ సంప్రదించకుండా ఫిబ్రవరిలో ఎన్నికలు అంటూ ప్రొసీడింగ్స్ విడుదల చేసిందని కూడా కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదని కూడా  ప్రభుత్వం తరఫున వాదనలుగా ఉన్నాయి.

ఇక తీర్పుని హై కోర్టు రిజర్వ్ చేసింది. అయితే సోమవారం దీని మీద తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంటున్నారు. హై కోర్టు కనుక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే మాత్రం కొత్త ఏడాది ఎన్నికల నగారా మోగడం ఖాయమని అంటున్నారు. మరి తీర్పు ఏ విధంగా వస్తుందో అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.








ఓటీటీని అలా కూడా వాడేసుకుంటారట...?

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>