PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-tdp-troubled-on-ghmc-elections3a018fbd-e271-4737-be26-d06d21ff5d23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-tdp-troubled-on-ghmc-elections3a018fbd-e271-4737-be26-d06d21ff5d23-415x250-IndiaHerald.jpgఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించి తమ సత్తా చాటుకుని జాతీయ పార్టీలు గా కొనసాగుతున్న టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు గ్రేటర్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు పెద్ద అవమానాన్ని కలిగించాయి. గ్రేటర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికలపడ్డారు. దీంతో తెలుగుదేశం పార్టీ అవమానం పాలు అయింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టిడిపి తెలంగాణలో ప్రభావం కోల్పోయినా, ఆ పార్టీ నేతలు మాత్రం గంభీరంగా ఉంటూనే తమది జాతీయ పార్టీ అంటూ గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. greter- war ghmc congress tdp;auto;telugu desam party;telangana;congress;telugu;gunde jaari gallanthayyinde;letter;tdp;lokesh kanagaraj;party;parugu;gunde jari gallanthayindeగ్రేటర్ యుద్ధం : ఆ రెండు పార్టీలకు గుండెజారి గల్లంతయ్యిందే ?గ్రేటర్ యుద్ధం : ఆ రెండు పార్టీలకు గుండెజారి గల్లంతయ్యిందే ?greter- war ghmc congress tdp;auto;telugu desam party;telangana;congress;telugu;gunde jaari gallanthayyinde;letter;tdp;lokesh kanagaraj;party;parugu;gunde jari gallanthayindeSat, 05 Dec 2020 05:00:00 GMT
ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించి  తమ సత్తా చాటుకుని జాతీయ పార్టీలు గా కొనసాగుతున్న టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు గ్రేటర్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు పెద్ద అవమానాన్ని కలిగించాయి. గ్రేటర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికలపడ్డారు. దీంతో  తెలుగుదేశం పార్టీ అవమానం పాలు అయింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టిడిపి తెలంగాణలో ప్రభావం  కోల్పోయినా, ఆ పార్టీ నేతలు మాత్రం గంభీరంగా ఉంటూనే తమది జాతీయ పార్టీ అంటూ గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. 



ఈ మధ్యనే తెలంగాణలో కొత్త కమిటీని కూడా వేసి పరుగులు పెట్టించాలని , టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా టిడిపిని నిలబెట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. తెలంగాణలో తమకు బలం లేదు అని తెలిసినా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే ఏకైక లక్ష్యంగా టిడిపి ఎన్నికల బరిలోకి దిగి 106 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వారెవరు డిపాజిట్లు కోల్పోయారు కూకట్ పల్లి జూబ్లీహిల్స్,  బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుకుంది. గ్రేటర్ ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను బరిలోకి దింపిన చంద్రబాబు,  లోకేష్ సైతం ఎన్నికల ప్రచారానికి దిగలేదు. ఫలితాలు తేడాగా ఉంటాయి అని తెలియడంతో ముందుగానే జాగ్రత్త పడ్డారు. 



తెలంగాణలో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది తామేనని, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అధికారం దక్కించుకుంటారు అని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ సైతం 2016 ఎన్నికల్లో సాధించిన రెండు స్థానాలను మళ్లీ ఇప్పుడు దక్కించుకుంది. నాచారం, పఠాన్ చెరువు లో మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ టీడీపీలకు కోలుకోలేనిి విధంంగా దెబ్బ తగిలిందిి. ఇక భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>