PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp710d65b6-81f7-4f9c-ac3a-95566a404b3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp710d65b6-81f7-4f9c-ac3a-95566a404b3e-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో జరిగేది ఇదే. ఎక్కడో ఒక చోట షాట్ తగిలితే మరో చోట యాక్షన్ కనిపిస్తుంది. ఇపుడు గ్రేటర్ పోరులో కధ అటూ ఇటూ తిరిగి ఓ పార్టీని ఏకంగా కింగ్ ని చేసే సీన్ కనిపిస్తోందిట. ఆ పార్టీయే మజ్లీస్. ఈ ఎన్నికల్లో మజ్లీస్ తన సీట్లు తాను తెచ్చుకుంది. 44 సీట్లు మజ్లీస్ పరమయ్యాయి.bjp;bharatiya janata party;congress;king;fort;king 1;dookudu;golcondaబీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?bjp;bharatiya janata party;congress;king;fort;king 1;dookudu;golcondaSat, 05 Dec 2020 10:30:00 GMTకింగ్ ని చేసే సీన్ కనిపిస్తోందిట. ఆ పార్టీయే మజ్లీస్. ఈ ఎన్నికల్లో మజ్లీస్ తన సీట్లు తాను తెచ్చుకుంది. 44 సీట్లు మజ్లీస్ పరమయ్యాయి.

అదే సమయంలో టీయారెస్ మెజారిటీకి దూరంగా ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకున్నా కూడా మ్యాజికి ఫిగర్ కి దూరంగానే టీయారెస్ ఉంటోంది. దాంతో మజ్లీస్ తో కలవడం అనివార్యంగా ఉంది. మజ్లీస్ కింగ్ మేకర్ గా ఈ ఎన్నికల్లో అవతరించింది. దానికి కారణం బీజేపీ దూకుడు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీజేపీ నాలుగు సీట్ల నుంచి అమాంతం 48 సీట్లకు పెరగడంతో అంతే సంఖ్యలో టీయారెస్ కి వచ్చే  సీట్లు తగ్గిపోయాయి. దాంతో ఇపుడు టీయారెస్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే మజ్లీస్ అండదండలు తప్పనిసరి. మరి మజ్లీస్ అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా అంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ కధ కూడా చూడాలి.

అదేంటి అంటే 2009 ఎన్నికల్లో ఇలాగే టీయారెస్ కి వచ్చినట్లుగానే కాంగ్రెస్ కి 52 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో  టీడీపీకి  45 సీట్లు వచ్చాయి. దాంతో అపుడు 43 సీట్లు గెలుచుకున్న మజ్లీస్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని చేపట్టింది. అయితే మజ్లీస్ పెట్టిన రాజకీయ బేరానికి కాంగ్రెస్ తలొగ్గి చెరి రెండున్నరేళ్ళ పాటు మేయర్ పదవిని పంచుకోవడానికి ఒప్పందం చేసుకుంది.

ఇపుడు కూడా సీన్ చూస్తూంటే అలాగే ఉందనిపిస్తోంది. మజ్లీస్ గతంలో మాదిరిగానే గేటర్  మేయర్ కుర్చీ సగం కాలానికి కావాలని పట్టుపట్టే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. దానికి టీయారెస్ కూడా అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి గోల్కొండ కోట మీద కాషాయం రెపరెపలు అంటూ బరిలోకి దిగిన బీజేపీ మజ్లీస్ కి మేయర్ పీఠం అప్పగించడానికి తన దూకుడు పనిచేసిందని అంగీకరిస్తుందా..





బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>