PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp15a0571c-e556-4e9a-9d81-ded49e5a9c24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp15a0571c-e556-4e9a-9d81-ded49e5a9c24-415x250-IndiaHerald.jpgది బిగ్ కౌంటింగ్ డే...తెరాస గెలిచినా విజయ సంబరం లేదు. బీజేపీకి ఓడినా ఓటమి బాధ లేనే లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రమే మారిపోయింది. గత ఎన్నికల్లో కేవలం సింగల్ డిజిట్ కి పరిమితమైన కమలం పార్టీకి తెలంగాణలో స్థానం లేదనే ప్రచారం జోరుగా జరిగింది. అలాంటిది తెరాస తో సహా రాజకీయ పరిశీలకులు సైతం తెరాస తిరుగులేని శక్తి అని భావిస్తూ వస్తున్నారు. రెండు సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా ఏ ఎన్నిక జరిగినా తెరాస వన్ సైడ్ వార్ గా నిలిచింది. బరిలో ఉన్న పార్టీలని మట్టి కరిపించి మరీ సత్తా చాటుకుంది.bjp;ktr;raghu;tiru;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;g kishan reddy;congress;mp;minister;war;central government;house;reddy;party;shakti;mantraతెరాస గెలిచి ఓడింది...బీజేపీ ఓడి గెలిచిందితెరాస గెలిచి ఓడింది...బీజేపీ ఓడి గెలిచిందిbjp;ktr;raghu;tiru;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;g kishan reddy;congress;mp;minister;war;central government;house;reddy;party;shakti;mantraSat, 05 Dec 2020 12:14:40 GMTతెరాస తో సహా రాజకీయ పరిశీలకులు సైతం తెరాస తిరుగులేని శక్తి అని భావిస్తూ వస్తున్నారు. రెండు సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా ఏ ఎన్నిక జరిగినా తెరాస వన్ సైడ్ వార్ గా నిలిచింది. బరిలో ఉన్న పార్టీలని మట్టి కరిపించి మరీ సత్తా చాటుకుంది.


దాంతో తెరాస లో ధీమా బాగా పెరిగింది. గత గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతామంటూ డంఖా బజాయించి చెప్పిన కేటీఆర్  ఒకటి తక్కువ వంద సీట్లను పార్టీకి కట్టబెట్టారు. ఫలితంగా రాష్ట్ర పురపాలక శాఖా మంత్రిగా సరికొత్త హోదా పొందారు. నిన్నటికి నిన్న సిటింగ్ సీట్ అయిన దుబ్బాక ఉపఎన్నికలో లక్షకి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందుతామంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే మారిన పరిస్థితుల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. అంతే...తెరాస ఒక్కసారి ఉలిక్కిపడింది.



 తమ పునాదులు బీటలు వారుతున్నాయన్న సంగతి గమనించింది. మళ్ళీ రానున్న ఎన్నికల్లో దుబ్బాక ఫలితం రిపీట్ కాకూడనే ఉద్దేశ్యంతో ఇంకొద్ది కాలం ఉన్నా ముందుకు జరిపి గ్రేటర్ ఎన్నికలను ఆదరాబాదరాగా జరిపించేసింది. కమలం పార్టీ గ్రేటర్లో జొరబడనీయకున్నా అడ్డుకట్ట వేయాలని తీవ్ర యత్నం చేసింది. కేటీర్ తుపాన్ పర్యటనలు, కొన్ని ముఖ్యమైన డివిజన్లలో ఇంచార్జులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా తారస సైన్యం బరిలో మోహరించింది. గ్రేటర్ మేయర్ పీఠం తమదే అంటూ కదనోత్సాహంతో ముందుకు కదిలింది.


సునాయాసంగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అధికార పార్టీ అడుగడుగునా ఆయాసపడింది. అయితే...దుబ్బాక విజయం ఇచ్చిన బలంతో బీజేపీ కూడా తెరాస ని అడ్డుకునేందుకు ఉన్నా తక్కువ సమయంలోనే చక చక పావులు కదిపింది. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకంటూ మిగిలిన పార్టీలు ఎద్దేవా చేసినా కేంద్రం లోని అగ్ర నాయకులని హైదరాబాద్ రప్పించింది. కేంద్ర హోమ్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి ఎన్నికల తీరు తెన్నులను పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. బీజీపీ, మజ్లీస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. మధ్యలో తెరాస కూడా ఈ యుద్ధంలో పాలుపంచుకుంది.  బాహాబాహీ పోరులో బరిలో పార్టీలున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆరెస్, బీజేపీ నడుమే జరిగింది.  


150 డివిజన్లున్న గ్రేటర్ లో తెరాస 55 డివిజన్లలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయినా మేయరుపీఠానికి కావాల్సిన సీట్లు రాకపోవడంతో ఈ సీట్లను గెలిచిన ఆనందం తెరాసకి దక్కలేదు. గ్రేటర్ లో బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించి తెరాస కి  అధికారానికి దూరమైనా ముచ్చెమటలు పట్టించింది. సింగల్ డిజిట్ నుంచి ఏకంగా 48 గెలుపంటే మాటలు కావు. మజ్లీస్ కూడా 44 డివిజన్లలో  విజయం సాధించి హ్యాపీ మూడ్ లోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం 2 డివిజన్లలో గెలిచి ఉనికిని కోల్పోయింది. మొత్తానికి గెలిచిన సంతోషం లేని తెరాస, ఓడినా ఆనందపడుతున్న బీజీపీ...ఇదీ గ్రేటర్ తాజా రాజకీయ ముఖచిత్రం.





పెళ్లి పెటాకులు వద్దు అంటూ పిల్లలను కంటున్నా టాలీవుడ్ హీరోయిన్స్

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>