PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corporator-candidates-with-criminal-records-in-ghmc-polls88c6d7a2-d51d-43b1-b7e2-843e284881f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corporator-candidates-with-criminal-records-in-ghmc-polls88c6d7a2-d51d-43b1-b7e2-843e284881f7-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఏ పార్టీకీ రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరిదనే అంశంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపిందిgreater-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;history;tdp;partyగ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?greater-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;history;tdp;partySat, 05 Dec 2020 20:18:59 GMTటీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. రెండో స్థానంలో 48 స్థానాలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దుమ్ము లేపింది. మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అవమానం మూట కట్టుకుంది. టీడీపీ అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు.

గ్రేటర్ లో మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం మీద 46 శాతం పైగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే ఇది రికార్డు బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఇంతలా జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క స్థానంలో మాత్రం ఫలితం నిలిపి వేశారు. అయితే ఆయా స్థానాల్లో గెలిచిన వారిలో ఎంత మంది నేర చరిత్ర ఉన్న వారో తెలుసా? ఎంత మంది కార్పొరేటర్లపై నేర కేసులు ఉన్నాయో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

గ్రేటర్ పరిధిలో పోటీ చేసిన మూడు ప్రధాన పార్టీల్లో కలిపి మొత్తం 25 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉందట. ఈ విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఈ నేర చరితుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, బీజేపీ అభ్యర్థుల్లో 10 మంది, అధికార టీఆర్ఎస్ క్యాండిడేట్లలో 8 మంది, ఎంఐఎం అభ్యర్థుల్లో 7గురు నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లట. ఈ జాబితాపై ఆయా పార్టీలు ఇప్పటి వరకూ ఎటువంటి కామెంట్లూ చేయలేదు. ఏదేమైనా మొత్తం పాతిక మంది నేర చరిత్ర ఉన్న వాళ్లు ఎన్నికల్లో గెలుపొందటం విశేషం.


గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?

పీసీసీ చీఫ్ రేసులో ముందున్నా.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>