PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/even-if-trs-becomes-the-biggest-party679fa6e7-aecb-470d-80ba-9d402aa3efee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/even-if-trs-becomes-the-biggest-party679fa6e7-aecb-470d-80ba-9d402aa3efee-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. అయితే పోలింగ్ రోజు వీళ్లంతా వచ్చి ఓటు వేయలేదు. ఓటు హక్కు వినియోగించుకున్న వారు 46.55 శాతం మాత్రమే. గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్- బీజేపీ- ఎంఐఎం హోరాహోరీగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ కూడా వీలైనంతలో పోరాటం చేసింది. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. గులాబీ దళం అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. even if trs becomes the biggest party;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;huzur nagar;kanna lakshminarayana;bank;parliment;assembly;tdp;mim party;uppal;partyటీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా..!టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా..!even if trs becomes the biggest party;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;huzur nagar;kanna lakshminarayana;bank;parliment;assembly;tdp;mim party;uppal;partySat, 05 Dec 2020 22:00:00 GMTకాంగ్రెస్ కూడా వీలైనంతలో పోరాటం చేసింది. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. గులాబీ దళం అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది.

టీఆర్ఎస్‌ 55 స్థానాల్లో గెలిచింది. బీజేపీకి 48 డివిజన్లు దక్కాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 99 స్థానాలు దక్కాయి. గతంతో పోల్చుకుంటే ఆ పార్టీ 44 సీట్లు నష్టపోయింది. బీజేపీ నాలుగు సీట్ల నుంచి 48 సీట్లకు పెరిగింది. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. టీఆర్ఎస్‌కు బీజేపీ కంటే ఏడు సీట్లు ఎక్కువగానే ఉన్నా... ఓట్లతేడా చాలా తక్కువ. టీఆర్‌ఎస్‌కి 35.81 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 35.56శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 8,500 మాత్రమే.

2016లో టీఆర్ఎస్43.85 శాతం ఓట్లు సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీ ఓటు బ్యాంక్ 35.81  శాతానికే పరిమితం అయింది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 8 శాతం పడిపోయింది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పట్లో బీజేపీ అభ్య్థులు 65 చోట్ల పోటీ చేశారు. ఆ పార్టీకి 10.34 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ ఈసారి ఎన్నికల్లో149 డివిజన్లలో పోటీ చేసింది. ఆ పార్టీకి 35.56 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు 20శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పాతబస్తీలోనూ కమలానికి ఓట్లు పెరిగాయి.

ఎంఐఎంకి గతంతో పోలిస్తే సీట్లు పెరగకున్నా.. ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో 15.85శాతం ఓట్లు గెలుచుకున్న మజ్లిస్‌ ఈసారి తన ఓటు బ్యాంక్‌ని 18.76 శాతానికి పెంచుకుంది. కాంగ్రెస్ విషయానికొస్తే గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆ పార్టీ రెండు సీట్లకే పరిమితం అయింది. అయితే ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చింది 6.67 శాతం ఓట్లు మాత్రమే.

పార్లమెంట్ నియోజగవర్గాలు, మున్సిపల్ జోన్ల వారీగా చూసినా.. బీజేపీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా చూస్తే.. ఎల్బీనగర్ సెగ్మెంట్‌లోని 11 డివిజన్లను స్వీప్ చేసింది. మహేశ్వరంలో రెండికి రెంటిని గెలుచుకుంది. రాజేంద్రనగర్, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్ పేట్, అంబర్ పేట్, జూబిలీహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, గోషామహల్, నాంపల్లిలో బీజేపీ ఒకటి అంత కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంది.

కూకట్ పల్లి, సికింద్రాబాద్, పటన్‌చెరులో నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గత మునిసిపల్ ఎన్నికల్లో బడంగ్‌ పేట్‌, మీర్‌పేట్‌, తుక్కుగూడ, అమన్‌గల్‌లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న నాలుగు స్థానాల్లో మూడు పాతబస్తీ నుంచే గెలిచింది. ఈసారి మాత్రం నగరం నాలుగు వైపులా తన పరిథిని విస్తరించుకుంది. సీట్లు గెలవలేని చోట కూడా బీజేపీ ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే బలపడింది.





ఈ ముద్దుగుమ్మలు ఎపుడు నిరూపించుకుంటారో..?

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>