PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hyderabad-floods-great-hurdle-for-trs-in-ghmc-elections337974fd-860e-4299-918d-b30859f239dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hyderabad-floods-great-hurdle-for-trs-in-ghmc-elections337974fd-860e-4299-918d-b30859f239dc-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఫలితాలు టీఆర్ఎస్ ఊహించని విధంగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి అనూహ్య బలాన్నిచ్చాయి. ఎంఐఎం, కాంగ్రెస్ బలాబలాల్లో పెద్ద మార్పేమీ లేదు. ఇంతకీ గ్రేటర్ ఫలితం ఇలా రావడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ కోల్పోయిన సీట్లు, బీజేపీకి రావడంలో అర్థమేంటి? గ్రేటర్ లో టీఆర్ఎస్ పట్టు కోల్పోతుందా? లేక స్థానిక సమస్యలు ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారాయా? greater-war;amala akkineni;hyderabad;telangana rashtra samithi trs;congress;local language;partyగ్రేటర్ యుద్ధం: హైదరాబాద్ లో వరదలు రాకపోయి ఉంటే..గ్రేటర్ యుద్ధం: హైదరాబాద్ లో వరదలు రాకపోయి ఉంటే..greater-war;amala akkineni;hyderabad;telangana rashtra samithi trs;congress;local language;partySat, 05 Dec 2020 12:00:00 GMTటీఆర్ఎస్ ఊహించని విధంగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి అనూహ్య బలాన్నిచ్చాయి. ఎంఐఎం, కాంగ్రెస్ బలాబలాల్లో పెద్ద మార్పేమీ లేదు. ఇంతకీ గ్రేటర్ ఫలితం ఇలా రావడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ కోల్పోయిన సీట్లు, బీజేపీకి రావడంలో అర్థమేంటి? గ్రేటర్ లో టీఆర్ఎస్ పట్టు కోల్పోతుందా? లేక స్థానిక సమస్యలు ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారాయా?

రాజకీయ విశ్లేషణలు చాలానే వినిపిస్తున్నా.. ఎన్నికలకు కొన్నిరోజుల ముందుగా వచ్చిన వరదలు గ్రేటర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించాయనే మాట మాత్రం వాస్తవం. గ్రేటర్ ఎన్నికలకు ముందుగానే వరదలొచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో వర్షాలు పడి, వరదనీటితో నగరం అతలాకుతలం అయింది. కాలనీలన్నీ జలమయం అయ్యాయి. పరామర్శకు వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అప్పుడే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుందనే వాదన బలపడింది.

కట్ చేస్తే దుబ్బాక ఎన్నికల ఫలితాలతో హడావిడిగా రెండు నెలల ముందుగానే గ్రేటర్ నగారా మోగేలా చేసింది ప్రభుత్వం. వరద కష్టాలను మాత్రం మరచిపోయింది. వరద పరిహారం అందిస్తున్నాం కదా, సరిపోతుందని భావించింది. కానీ ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో పరిహారం నిలిచిపోయింది. తమకీ దుస్థితికి కారణం టీఆర్ఎస్ పార్టీయేనంటూ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. వరద కష్టాల్లో తమను పట్టించుకోలేదని, ఆక్రమణల తొలగింపు విషయంలో ఉదాసీనంగా ఉందని భావించిన గ్రేటర్ వాసులు.. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకరకంగా టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే బీజేపీకి వరంలా మారింది. ఆ పార్టీ గ్రేటర్ లో గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. వరదలే రాకపోయి ఉంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉండేదనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తమ్మీద వరదలతో టీఆర్ఎస్ పార్టీ బాగా నష్టపోయింది. ఇకనైనా అధికార పార్టీలు గ్రేటర్ లో ఆక్రమణలపై దృష్టిపెడితే బాగుంటుంది. ఆక్రమణల తొలగింపుతోనే భాగ్య నగరం ముంపు బారిన పడకుండా ఉంటుంది. 


బాలయ్య కోసం రెడీ అవుతోన్న రెండు కథలు.. పాన్స్‌కు పండగే!

జగన్ దెబ్బకు వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ

బిజెపి తర్వాతి టార్గెట్ జగనే...?

బీజేపీ దూకుడుతో ఆ పార్టీకి ఫుల్ హ్యాపీ ?

కేటిఅర్ బిజెపిని అర్ధం చేసుకోలేకపోయారా...?

బిజెపి దెబ్బకు కేసీఆర్ సంచలన నిర్ణయం...?

చిరంజీవి హీరోగా మరో ‘రెడ్డి’ సినిమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>