PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-fails-the-tdp-new-strategy-f9bacecf-6d75-4e71-b89b-2d8251f8a57a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-fails-the-tdp-new-strategy-f9bacecf-6d75-4e71-b89b-2d8251f8a57a-415x250-IndiaHerald.jpgజగన్ అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏదొరకంగా, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం పదవి చేపట్టిన దగ్గర నుంచి ప్రతి నిర్ణయంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఎలాగోలా జగన్ తీసుకునే నిర్ణయాన్ని ఆపడానికే ప్రయత్నించారు. ఇంకా జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేశారు. jagan;amala akkineni;jagan;government;assembly;tdp;ycpటీడీపీ ప్లాన్‌ని ఫెయిల్ చేసిన జగన్...దెబ్బ పడిందిగా...!టీడీపీ ప్లాన్‌ని ఫెయిల్ చేసిన జగన్...దెబ్బ పడిందిగా...!jagan;amala akkineni;jagan;government;assembly;tdp;ycpSat, 05 Dec 2020 02:00:00 GMTజగన్ అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏదొరకంగా, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం పదవి చేపట్టిన దగ్గర నుంచి ప్రతి నిర్ణయంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఎలాగోలా జగన్ తీసుకునే నిర్ణయాన్ని ఆపడానికే ప్రయత్నించారు. ఇంకా జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేశారు.

జగన్ అధికారంలోకి ఏడాదిన్నర దాటింది. ఈ ఏడాదిన్నర కాలంలో జగన్‌ని ఎంతగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో, అంతా చూస్తూనే ఉన్నారు. ఎలాగైనా జగన్‌ని నెగిటివ్ చేసి, చంద్రబాబు పుంజుకోవాలని చూశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అయ్యాయి. అందుకే జగన్‌పై ప్రజలకు నమ్మకం పోలేదు. అయినా సరే టీడీపీ వాళ్ళు, జగన్ ప్రభుత్వంపై ఏదొరకంగా నెగిటివ్ ప్రచారం చేస్తూనే వచ్చారు.

అందుకే అసెంబ్లీలో సైతం ఆ నెగిటివ్ ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. పైగా ఇక్కడ టీడీపీ ఓ స్కెచ్‌తో ముందుకెళ్లినట్లు కనిపించింది. జగన్ ఏమన్నా అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకున్నా, దానికి అడ్డుపడే కార్యక్రమం చేశారు. ఐదు రోజుల సమావేశాల్లో టీడీపీ నేతలు ఇదే ధోరణిలో ముందుకెళ్లారు. మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు ఏదొకవిధంగా అడ్డుపడే కార్యక్రమమే చేశారు.

దీంతో ఈ ప్లాన్‌ని జగన్ ముందే కనిపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రతిరోజు టీడీపీ నేతలు స్పీకర్ పోడియం వద్ద గోల చేయడం, వారిని స్పీకర్ సస్పెండ్ చేయడం చేశారు. అయిదురోజులు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అవుతూ వచ్చారు. జగన్ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు లేచి గోల చేయడం, స్పీకర్ ముందుకెళ్లి హడావిడి చేయడం చేశారు. దీంతో ఎమ్మెల్యేలని స్పీకర్ సస్పెండ్ చేసేశారు. దాని వల్ల జగన్ చెప్పాలనుకున్నది ప్రజల్లోకి వెళ్లింది. లేదంటే టీడీపీ ప్లాన్ ప్రకారం జరిగితే జగన్ మాటలు ప్రజల్లోకి వెళ్ళేవి కాదు.




చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>