MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla0c64f62d-62b2-44ac-9f12-16ccadcd787d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla0c64f62d-62b2-44ac-9f12-16ccadcd787d-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లాలో అధికార వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు సత్తా చాటుతున్నారు. దీంతో టీడీపీ పుంజుకోలేకపోతుంది. ఇక వైసీపీకి కంచుకోటగా ఉన్న మంత్రాలయంలో సైతం టీడీపీకి ఛాన్స్ లేకుండా పోతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దూసుకెళుతున్నారు. అయితే బాలనాగిరెడ్డి టీడీపీ నుంచి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ysrcp mla;nithya new;tiru;2019;district;mla;aqua;tdp;ycp;dookudu;party;raghavendraహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీకి తిరుగులేదా?ysrcp mla;nithya new;tiru;2019;district;mla;aqua;tdp;ycp;dookudu;party;raghavendraSat, 05 Dec 2020 05:00:00 GMTవైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు సత్తా చాటుతున్నారు. దీంతో టీడీపీ పుంజుకోలేకపోతుంది. ఇక వైసీపీకి కంచుకోటగా ఉన్న మంత్రాలయంలో సైతం టీడీపీకి ఛాన్స్ లేకుండా పోతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దూసుకెళుతున్నారు. అయితే బాలనాగిరెడ్డి టీడీపీ నుంచి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక తర్వాత వైసీపీలోకి వచ్చి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన బాలనాగిరెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి. అలాగే కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అటు బాలనాగిరెడ్డి రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న మంత్రాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, జిల్లా అంతర్గత వాణిజ్య- వ్యాపార రంగాల అభివృద్ధి కోసం మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్‌ అవసరం చాలా ఉంది. ఈ రైల్వే లైన్‌కు 50 ఏళ్ల నుంచి మోక్షం కలగడం లేదు.

ఇక పార్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ పూర్తి బలంగా ఉంది. టీడీపీ తరుపున తిక్కారెడ్డి పనిచేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ బాలనాగిరెడ్డి బలంగా ఉండటం వల్ల, తిక్కారెడ్డి పుంజుకోలేదు. ఇక ఈ నాలుగేళ్లలో బాలనాగిరెడ్డి బలం ఏమన్నా తగ్గితే, తిక్కారెడ్డికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. మూడుసార్లు వరుసగా గెలవడంతో బాలనాగిరెడ్డికి మంత్రాలయంలో తిరుగులేకుండాపోయింది. ఒకవేళ తిక్కారెడ్డి ఇంకొంచెం కష్టపడి, టీడీపీని బలోపేతం చేస్తే బాలనాగిరెడ్డికి పోటీ ఇవ్వొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ జెండా బలం పాతుకుపోయినట్లే కనిపిస్తోంది.




గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>