PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy6ef7dc2a-14b4-4072-abc7-d83c19ed27dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddy6ef7dc2a-14b4-4072-abc7-d83c19ed27dc-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందాడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ.. ఎంఐఎం పార్టీలు సీట్లు సాధించడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకొని గల్లీ స్థాయికి పడిపోయింది.revanthreddy;auto;soniagandhi;amala akkineni;kumaar;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;huzur nagar;december;tpcc;reddy;josh;partyఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపుఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపుrevanthreddy;auto;soniagandhi;amala akkineni;kumaar;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;huzur nagar;december;tpcc;reddy;josh;partySat, 05 Dec 2020 08:36:32 GMTఢిల్లీ నుంచి రేవంత్ కు పిలుపు

కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకేనా?

ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో టీపీసీసీ రేవంత్ రెడ్డికేనని ప్రచారం


జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందాడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. గ్రేటర్లో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ.. ఎంఐఎం పార్టీలు సీట్లు సాధించడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది. ఇక కాంగ్రెస్ మాత్రం కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకొని గల్లీ స్థాయికి పడిపోయింది.

తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఓటమి పాలవడాన్ని కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేజేతుల తెలంగాణలో తన స్థాయిని కోల్పోతూ వస్తోంది. హూజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందని అప్పుడే ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని భావించగా ఆ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అమలు కాలేదు. తాజాగా దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత టీపీసీసీ మార్పు ఉంటుందని అనుకున్నప్పటికీ జరుగలేదు. తాజాగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీని కట్టబెడుతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అయితేనే అటూ టీఆర్ఎస్.. ఇటూ బీజేపీని ధీటుగా ఎదుర్కొంటాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

కాంగ్రెస్ ను వీడిన సీనియర్లను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే సత్తా రేవంత్ కే ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డికే టీపీసీసీ పదవీ కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించుకుందని సమాచారం. రేవంత్ కే పీసీసీ దక్కుతుందన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కాగా రేవంత్ కే టీపీసీసీ దక్కుతుందా? లేక మరేవరికైనా టీపీసీసీ ఇస్తారనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.




చిరు తన సినిమాలకు 'రెడ్డి' ట్యాగ్ ని వదల్లేకపోతున్నాడేంటి..?

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>