PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjpf6d6b213-a607-4eee-a286-893e44b8a17d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjpf6d6b213-a607-4eee-a286-893e44b8a17d-415x250-IndiaHerald.jpgజీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్య ఫ‌లితాలను న‌మోదు చేయ‌డంతో ఆ పార్టీ అధిష్ఠానం సంబురంగా ఉంది. ప్ర‌ధాన‌మంత్రి మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు ధ‌న్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కార్యకర్తలను ప్రతbjp;view;amit shah;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;amith shah;assembly;minister;central government;josh;partyగ్రేట‌ర్ విజ‌యంపై బీజేపీ అగ్ర‌నేత‌ల సంబురం.. అస‌లు ఆట మొద‌లు కాబోతోందా...?!గ్రేట‌ర్ విజ‌యంపై బీజేపీ అగ్ర‌నేత‌ల సంబురం.. అస‌లు ఆట మొద‌లు కాబోతోందా...?!bjp;view;amit shah;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;amith shah;assembly;minister;central government;josh;partySat, 05 Dec 2020 07:28:56 GMTబీజేపీ అనూహ్య ఫ‌లితాలను న‌మోదు చేయ‌డంతో ఆ పార్టీ అధిష్ఠానం సంబురంగా ఉంది.
ప్ర‌ధాన‌మంత్రి మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు ధ‌న్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో అమిత్ షా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర అగ్రనేతలు సైతం బల్దియా ఎన్నికల ప్రచారానికి వచ్చారు.


రాష్ట్ర‌, జాతీయ నాయ‌క‌త్వాల స‌మన్వ‌యంతో వ్యూహాత్మ‌కంగా సాగిన ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇక  రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఘ‌నంగా చాటారు. దుబ్బాక ఉప ఎన్నిక‌తో బీజేపీలో జోష్ వ‌చ్చింది.  తాజాగా గ్రేట‌ర్ ఫ‌లితాల‌తో ఎన‌లేని న‌మ్మ‌కం వ‌చ్చి చేరింది.  వాస్త‌వానికి 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో కైవసం చేసుకుంది. ఓ వైపు అధికారపార్టీ టీఆర్ఎస్, ఎంఐఎం విమర్శలకు కౌంటర్ ఇస్తూ ప్రజల్లో పట్టునిలుపుకుంది. గ్రేటర్లో మేజిక్ ఫిగర్ సాధించనప్పటికీ రెండో స్థానానికి చేరుకోవడంతో గెలుపుతో సమానంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.  



గత ఎన్నికల్లో ఏకంగా 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌.. ఈసారి 43 స్థానాలను కోల్పోయింది. కేవలం 55 డివిజన్లకే పరిమితమైంది. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కూడా మేయర్‌ పీఠాన్ని దక్కించకోవడానికి కూడా పదడుగుల దూరంలో నిలిచిపోయింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో   గ‌ట్టి పోటీ ఇచ్చినా బీజేపీ ఇప్పుడు రాజ‌కీయ బ‌లంతో టీఆర్ ఎస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప‌వ‌నాలు వీస్తాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ అధిష్ఠానం పావులు క‌దుపుతుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాల‌కు తావులేదు. అస‌లు రాజ‌కీయం ఇప్పుడే మొద‌ల‌వుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.








ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>