PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi4f5119ae-c535-4e9e-8473-dff4ea2f9d4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi4f5119ae-c535-4e9e-8473-dff4ea2f9d4f-415x250-IndiaHerald.jpgబండి సంజయ్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అన్నిటి కంటే ముందు చెప్పాల్సింది ఆయన్ బీజేపీకి రెండు కళ్ళు లాంటి మోడీ, అమిత్ షా గుడ్ లుక్స్ లో ఉన్నారన్నది. ఆ ఇద్దరు వ్యూహాలు, పౌరుషాలు, టార్గెట్లూ అన్నీ కూడా పుణికి పుచ్చుకుని మరీ సంజయ్ తెలంగాణాలో చెలరేగిపోతున్నాడు. అతన్ని తెలంగాణా బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ చేసినపుడు బీజేపీ పెద్దలకు ఏమేమి ఆశలు ఉన్నాయో కానీ చాలా తక్కువ టైం లో వాటిని నెరవేర్చి బీజేపీకి సౌత్ దారి చూపించారు. bandi;modi;amit shah;kcr;hyderabad;bharatiya janata party;korea, south;amith shah;mp;backward classes;huzur nagar;minister;central government;karimnagarకేంద్ర మంత్రిగా బండి సంజయ్ ?కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ?bandi;modi;amit shah;kcr;hyderabad;bharatiya janata party;korea, south;amith shah;mp;backward classes;huzur nagar;minister;central government;karimnagarSat, 05 Dec 2020 22:00:00 GMTమోడీ, అమిత్ షా గుడ్ లుక్స్ లో ఉన్నారన్నది. ఆ ఇద్దరు వ్యూహాలు, పౌరుషాలు, టార్గెట్లూ అన్నీ కూడా పుణికి పుచ్చుకుని మరీ సంజయ్ తెలంగాణాలో చెలరేగిపోతున్నాడు. అతన్ని తెలంగాణా బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ చేసినపుడు బీజేపీ పెద్దలకు ఏమేమి ఆశలు ఉన్నాయో కానీ చాలా తక్కువ టైం లో వాటిని నెరవేర్చి బీజేపీకి సౌత్ దారి చూపించారు.

కరీంనగర్ లో ఒక సాధారణ కార్పోరేటర్ గా బండి సంజయ్ రాజకీయ పయనం మొదలైంది. ఆయన 1986 నుంచి ఆరెసెస్ ద్వారా బీజేపీ రాజకీయాల్లో ఉన్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కార్పోరేటర్ గా నెగ్గిన సంజయ్ ఆ తరువాత ఎమ్మెల్యేగా ఓడినా ఏకంగా ఎంపీ సీటునే పట్టేశారు. అది కూడా కేసీయార్ కి కుడి భుజం లాంటి ఎంపీని ఓడించి మరీ చట్ట సభల్లో కాలు పెట్టారు.

ఇక సంజయ్ బీజేపీ బండి ఎక్కాక ఆ దూకుడే వేరు అన్నట్లుగా రాజకీయ  కధ సాగింది. దుబ్బాక ఉప ఎన్నికలో  అన్నీ తాను అయి అనూహ్యమైన విజయం బీజేపీకి తెచ్చిన సంజయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ మరింతగా దూకుడు పెంచేశారు. అర్ధ శతకం కొట్టి మరీ ఔరా అనిపించారు. ఇపుడు సంజయ్ అంటే అమిత్ షా, మూడీ ఇద్దరూ మోజు పెంచుకుంటున్నారు. ఆయన తెలంగాణాలో బీజేపీని ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన తీరుకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నారుట.

త్వరలో జరిగే విస్తరణలో బండి సంజయ్ కచ్చితంగా కేంద్ర మంత్రి అవౌతారని అపుడే ప్రచారం సాగుతోంది. సంజయ్ దూకుడికి తగినట్లుగా అధికారం కూడా చేతిలో ఉంటే ఇక టీయారెస్ ని ఎదుర్కోవడం మరింత ఈజీ అవుతుందని కేంద్ర  పెద్దలు భావిస్తున్నారుట. అదే జరిగితే ఈ బీసీ నేత కేంద్ర మంత్రిగా మారుతారన్నమాట. చూడాలి మరి.




ఈ ముద్దుగుమ్మలు ఎపుడు నిరూపించుకుంటారో..?

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>