PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-reverse-on-jagan-issue-is-trouble-to-ysrcp5dc8015b-aebf-42b9-ab8f-ce934356f599-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-reverse-on-jagan-issue-is-trouble-to-ysrcp5dc8015b-aebf-42b9-ab8f-ce934356f599-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అసెంబ్లీలో అధికార పక్షం బలం ఎక్కువగా ఉండటంతో, టీడీపీ నేతలకు డిఫెండ్ చేయడం చాలా కష్టమైపోయింది. అయినా సరే టీడీపీ నేతలు ఏదొరకంగా అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జగన్ పాదయాత్ర సమయంలో ఏమి హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారు. వాటిని అమలు చేసే విధానంలో ఎలా అమలయ్యాయనే విషయంపై టీడీపీ నేతలు బాగానే ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నtdp;amala akkineni;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;scheduled caste;scheduled tribes;backward classes;chief minister;assembly;mla;tdp;ycp;reddyరివర్స్ అయిన టీడీపీ...ఆ విషయంలో వైసీపీ బుక్ అయినట్లేనా?రివర్స్ అయిన టీడీపీ...ఆ విషయంలో వైసీపీ బుక్ అయినట్లేనా?tdp;amala akkineni;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;scheduled caste;scheduled tribes;backward classes;chief minister;assembly;mla;tdp;ycp;reddySat, 05 Dec 2020 01:00:00 GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అసెంబ్లీలో అధికార పక్షం బలం ఎక్కువగా ఉండటంతో, టీడీపీ నేతలకు డిఫెండ్ చేయడం చాలా కష్టమైపోయింది. అయినా సరే టీడీపీ నేతలు ఏదొరకంగా అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జగన్ పాదయాత్ర సమయంలో ఏమి హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారు. వాటిని అమలు చేసే విధానంలో ఎలా అమలయ్యాయనే విషయంపై టీడీపీ నేతలు బాగానే ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో ఎన్నికలకు ముందు సభల్లో జగన్..మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పారని, కానీ మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతామని పెట్టారని, అయితే మొదట 250 రూపాయలు పెంచిన జగన్ ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం ఇంకా పెంచలేదని మాట్లాడుతున్నారు. అలాగే 45 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పారని, కానీ గెలిచాక వైఎస్సార్ చేయూత ద్వారా సంవత్సరానికి రూ. 18, 750 ఇచ్చారని, కానీ పెన్షన్ ఇచ్చి ఉంటే సంవత్సరానికి 36 వేలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పే ప్రయత్నం చేశారు.


ఇక దీనిపై జగన్ సీరియస్ అయ్యి, నిమ్మల అబద్దాలు చెబుతున్నారని చెప్పి, ఆయనపై సభ హక్కుల నోటీసు ఇస్తామని చెప్పారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు రివర్స్ అయ్యి, అసెంబ్లీ  సమావేశాల్లో పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ తప్పుడు సమాచారం ఇచ్చారని, దానికి వ్యతిరేకంగానే ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని టీడీపీ చెప్పింది. అక్టోబరు 2018నాటికి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వివరాలపై తప్పుడు వివరాలు చెప్పి సభను తప్పుదోవపట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు టీడీపీ తెలిపింది. అయితే టీడీపీ నేతలు అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలనే చూస్తున్నారని, అందుకే జగన్ సీరియస్ అయ్యారని, కానీ టీడీపీ ఇప్పుడు రివర్స్‌లో జగన్‌ని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.





గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>