Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/corona4a0d1885-adb9-4f5a-ab8e-e40b1fffd995-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/corona4a0d1885-adb9-4f5a-ab8e-e40b1fffd995-415x250-IndiaHerald.jpgఅమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ పీ ఫైజర్ వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయంలో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య శాఖ ఆమెదం తెలిపింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. పీఫైజర్ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పూర్తిగా ...corona;health;india;russia;bahrain;england;american samoaపీ ఫైజర్ వ్యాక్సిన్‌‌ వినియోగానికి ఓకే చెప్పిన రెండో దేశంపీ ఫైజర్ వ్యాక్సిన్‌‌ వినియోగానికి ఓకే చెప్పిన రెండో దేశంcorona;health;india;russia;bahrain;england;american samoaSat, 05 Dec 2020 21:32:00 GMT అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ పీ ఫైజర్ వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయంలో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య శాఖ ఆమెదం తెలిపింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. పీఫైజర్ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పూర్తిగా పరీశీలించి, సమీక్షించిన తరువాతనే ఆమోదం తెలిపినట్లు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాలోని పీ ఫైజర్ సంస్థతో పాటు జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థ కూడా పాల్గొంది.    

పీఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ కూడా ఆమెదం తెలిపింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ఆమెందించిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే.. గత నెల చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ వినియోగానికి కూడా బహ్రెయిన్ ఆమెదం తెలిపింది. చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేసిన ఆ వ్యాక్సిన్‌ను దాదాపు 6000 మందికి అందజేసింది కూడా. అయితే దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇక ఇప్పుడు పీ ఫైజర్ కూడా రానుండడంతో బహ్రెయన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ అమెరికాలోని పీఫైజర్ సంస్థ నుంచి బహ్రెయిన్‌‌కు ఎప్పుడు అందుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.     

ఇదిలా ఉంటే ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనాను నిర్మూలించేందుకు అన్ని దేశాలూ ఎంతగానో కష్టపడుతున్నాయి. అమెరికా, రష్యా, భారత్, చైనా, ఇంగ్లండ్ వంటి అనేక దేశాలు ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలవుతున్నాయి. ఈ దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లన్నీ దాదాపు 90 శాతానికి పైగా ఫలితాలనిస్తున్నట్లు ఆయా వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లలో చాలావరకు చివరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి.     





అరుదైన గౌరవవం పొందిన సోనూసూద్ .ఐఏఎస్ కాలేజికి సోనూసూద్ పేరు

పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు.. సీనియర్ నేత కామెంట్స్!

గ్రేటర్ యుద్ధం: బీజేపీ విజయంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్లేనా..?

గ్రేటర్ యుద్ధం: నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు ఎంత మందో తెలుసా?

టాలీవుడ్ కి ధైర్యాన్ని ఇచ్చిన ఓపెనింగ్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>