PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-two-tdp-leaders-again-close-to-chandrababub62178ca-5cca-46c4-9133-d50070d84abf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-two-tdp-leaders-again-close-to-chandrababub62178ca-5cca-46c4-9133-d50070d84abf-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో వ్యవసాయ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు, రైతుసంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలి అని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలి అన్నారు. ఈ బిల్లులపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలి అని ఆయన కేంద్రానికి సూచనలు చేసారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర డిబేట్ జరపాలి అన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలి అని సూచించారు. సగటు భాchandrababu;modi;mano;dharma;government;tdp;local language;central government;ycp;manamమోడీ సర్కార్ కి చంద్రబాబు చురకలుమోడీ సర్కార్ కి చంద్రబాబు చురకలుchandrababu;modi;mano;dharma;government;tdp;local language;central government;ycp;manamSat, 05 Dec 2020 17:53:21 GMTటీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు, రైతుసంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలి అని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలి అన్నారు. ఈ బిల్లులపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలి అని ఆయన కేంద్రానికి సూచనలు చేసారు.  అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర డిబేట్ జరపాలి అన్నారు.  అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలి అని సూచించారు.

సగటు భారతీయ రైతు అక్షరాస్యత, అవగాహనలతో పాటు, స్థానిక రైతు నిస్సహాయతను కూడా పరిగణించి చట్టాలను రూపొందించాలన్నారు. బిల్లులను హడావుడిగా ప్రవేశపెట్టి, తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు అని ఆయన పేర్కొన్నారు. సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలు. లేకపోతే ఇప్పటికే అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతన్నలపై మరింత భారం మోపే ప్రమాదం ఉంది అన్నారు. కనీస మద్దతు ధర పొందడం అనేది ఒక విధాన నిర్ణయంగానే కాకుండా రైతుకు చట్టబద్దమైన హక్కుగా ఉండాలన్నారు. ఎంఎస్ పి పొందడం అనేది కొందరి దయాదాక్షిణ్యాల మీద  ఆధారపడి ఉండరాదు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని ఆయన సూచించారు.
 
రైతు నిస్సహాయతను తమ లాభాల కోసం వాడుకునే వ్యవస్థలను, వ్యక్తులను ప్రోత్సహించరాదు అని, ఆత్మవిశ్వాసం భారతీయ రైతన్నల ఆత్మగౌరవం అన్నారు. తమ కృషిపై, ప్రకృతిపై, ప్రభుత్వంపై మన రైతన్నల్లో తొణికిసలాడే విశ్వాసాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వారి స్వతంత్రతను, మనో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం పాలకుల ధర్మం అని,  రైతాంగ ప్రయోజన విధానాలతోనే  వారి విశ్వాసాన్ని ఇనుమడింప చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది అన్నారు. 22మంది ఎంపిలు ఉండి లోక్ సభలో  వైసిపి నోరు తెరవక పోవడం రైతుద్రోహం అని మండిపడ్డారు.


నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా...?

ఢిల్లీ లో రైతుల నిరసన ను మీడియా పట్టించుకోవట్లేదా..?

గ్రేటర్ యుద్దం : బండి సంజయ్ కి డిల్లీ నుండి పిలుపు..విషయం ఏంటో ..??

“సంతోషం” సినిమాలో నాగార్జున కొడుకు ఇప్పుడు హీరోల ఉన్నాడు ..మీరు చూడండి

గ్రేటర్ ఫలితాలపై కమలనాధుల సమీక్ష: ఎలా ముందుకు వెళ్లాలని అంతర్మధనం

గ్రేటర్ ఫలితం తో బండి సంజయ్ లో ఇంత మార్పా..?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పొత్తు పై అసదుద్దీన్ కిలక వ్యాఖ్యలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>