EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-telangana-ghmc-elections-bjp-mim-congress-trs9a01301c-8314-4a0c-8d24-11fdc45267f8-415x250-IndiaHerald.jpgఎందుకంటే కేవలం కేసీయార్ రాజకీయ వ్యూహాల్లో లోపాలున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. తెలంగాణాలో తనకు ఎదురన్నదే లేకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడేశారు. ముందుగా తెలుగుదేశంపార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలను చీల్చేశారు. పై పార్టీల ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు సీనియర్ నేతలను నయానో భయానో టీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ లను దెబ్బకొట్టేస్తే ఇక తనకు తిరుగే ఉండదని కేసీయార్ అనుకున్నారు కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని గుర్తించలేకపోయారు. నిజానికి టీడీపీపై ప్రత్యేkcr telangana ghmc elections bjp mim congress trs;view;cbn;kcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;congress;telugu;car;tdp;central government;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ చేసిన తప్పే టీఆర్ఎస్ కొంప ముంచిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ చేసిన తప్పే టీఆర్ఎస్ కొంప ముంచిందా ?kcr telangana ghmc elections bjp mim congress trs;view;cbn;kcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;congress;telugu;car;tdp;central government;partySat, 05 Dec 2020 03:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో తాజాగా వెల్లడైన ఫలితాలను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలిచింది. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికలో సింగిల్ లార్జెస్టు పార్టీగా టీఆర్ఎస్ మొదటిస్ధానంలో నిలిచినా చాలా డివిజిన్లు కారులో నుండి దిగిపోయాయన్నది వాస్తవం. పోయిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో గెలిస్తే ఇపుడు గెలిచింది 56 డివిజన్లలో మాత్రమే. అంటే 43 డివిజన్లను కోల్పోయిందని అర్ధమైపోతోంది. అధికారపార్టీగా ఉండి కూడా ఏకంగా 43 డివిజన్లను కోల్పోయిందంటే చాలా అవమానమనే చెప్పాలి. తెలంగాణాలో తమను ఎదుర్కొనేంత సీన్ ఏ పార్టీకి కూడా లేదని తరచు కేసీయార్, కేటీయార్ తో పాటు యావత్ టీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పిన విషయం అందరు చూసిందే. మరి అదే నిజమైతే ఇఫుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా సగానికి సంగం డివిజన్లు ఎందుకు కోల్పోయినట్లు ?




ఎందుకంటే కేవలం కేసీయార్ రాజకీయ వ్యూహాల్లో లోపాలున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. తెలంగాణాలో తనకు ఎదురన్నదే లేకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడేశారు. ముందుగా తెలుగుదేశంపార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలను చీల్చేశారు. పై పార్టీల ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు సీనియర్ నేతలను నయానో భయానో టీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ లను దెబ్బకొట్టేస్తే ఇక తనకు తిరుగే ఉండదని కేసీయార్ అనుకున్నారు కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని గుర్తించలేకపోయారు.  నిజానికి టీడీపీపై ప్రత్యేకించి కేసీయార్ దృష్టి పెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజనతోనే టీడీపీ నాశనం అయిపోయింది. చంద్రబాబునాయుడు రెండుకళ్ళ సిద్ధాంతమే పార్టీని దుంపనాశనం చేసేసింది.




ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్దితి కూడా ఇలాగే తయారైంది. తెలంగాణా ఇచ్చిన పార్టీగా కూడా జనాలు కాంగ్రెస్ ను గుర్తించలేదు. చూడబోతే మెజారిటి జనాల అభిమతానికి భిన్నంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసిందన్న కోపం తెలంగాణా జనాల్లో కూడా ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకనే జనాలే కాంగ్రెస్ ను పట్టించుకోవటం మానేశారు. కేసీయార్ కూడా కాంగ్రెస్ పార్టీని దాని మానాన దాన్ని వదిలేసుంటే సరిపోయేది. కొన్నిచోట్ల కాంగ్రెస్ బలంగా ఉన్నా ఆ బలం బీజేపీతో పోటీ పడి రెండోస్ధానంలో నిలబడేందుకు మాత్రమే  సరిపోయేది.  అలా కాదని ఒకేసారి ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ ను కేసీయార్ దెబ్బ కొట్టేటప్పటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ లేచింది. ఇదే సమయంలో కేంద్రంలో బాగా బలంగా ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చింది. కేంద్రం ఇచ్చిన దన్నుతో తెలంగాణాలో బలంగా తయారవుతోంది. బీజేపీని అదుపుచేసేంత సీన్ కేసీయార్ లో లేదన్నది వాస్తవం. కాబట్టి ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు డివిజన్ల నుండి 46 డివిజన్లకు పెరిగిందంటే కేవలం కేసీయార్ చేతకాని తనం వల్లే అన్నది వాస్తవం.





పవన్‌కు ప్లస్ అవుతున్న వైసీపీ...అక్కడే హైలైట్ అయ్యేది...

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>