PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-202063a8719e-4ab8-43e2-bc96-1cadf1d2eab8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-202063a8719e-4ab8-43e2-bc96-1cadf1d2eab8-415x250-IndiaHerald.jpgగ్రేటర్ యుద్ధం ముగిసింది. ఫలితాల ప్రకటన వెలువడింది. స్పష్టంగా ఏ పార్టీకి సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం లభించకపోయినా, మొత్తానికి గ్రేటర్ పీఠంపై టిఆర్ఎస్ అభ్యర్థి కూర్చుంటారు అనే విషయం స్పష్టమైంది. బిజెపి , ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుతానికి గ్రేటర్ లో మేయర్ పీఠంపై కూర్చునేది టిఆర్ఎస్ అభ్యర్థి అనే విషయం స్పష్టమైపోయింది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ఆ అవకాశం ఎవరికి ఇస్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. గ్రేటర్ మేయర్ పీఠం మహిళలకు రిజర్వ్ కావడంతో , ఇప్పుడు అంతా మేయర్ అభ్యర్థి విషయంపై ఆgreter- war ghmc elections kcr mim;auto;kcr;sridevi kapoor;vijayashanti;bharathi old;kavitha;pragathi;vijayalakshmi;bharatiya janata party;korcha;mp;huzur nagar;chief minister;mla;wife;letter;mim party;reddy;v;partyగ్రేటర్ యుద్ధం : మేయర్ గా ఆ ముగ్గురిలో ఎవరో ?గ్రేటర్ యుద్ధం : మేయర్ గా ఆ ముగ్గురిలో ఎవరో ?greter- war ghmc elections kcr mim;auto;kcr;sridevi kapoor;vijayashanti;bharathi old;kavitha;pragathi;vijayalakshmi;bharatiya janata party;korcha;mp;huzur nagar;chief minister;mla;wife;letter;mim party;reddy;v;partySat, 05 Dec 2020 07:47:15 GMT
గ్రేటర్ యుద్ధం ముగిసింది. ఫలితాల ప్రకటన వెలువడింది. స్పష్టంగా ఏ పార్టీకి సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం లభించకపోయినా, మొత్తానికి గ్రేటర్ పీఠంపై టిఆర్ఎస్ అభ్యర్థి కూర్చుంటారు అనే విషయం స్పష్టమైంది. బిజెపి , ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుతానికి గ్రేటర్ లో మేయర్ పీఠంపై కూర్చునేది టిఆర్ఎస్ అభ్యర్థి అనే విషయం స్పష్టమైపోయింది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ఆ అవకాశం ఎవరికి ఇస్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. గ్రేటర్ మేయర్ పీఠం మహిళలకు రిజర్వ్ కావడంతో , ఇప్పుడు అంతా మేయర్ అభ్యర్థి విషయంపై ఆసక్తి గా ఉన్నారు. 



ప్రస్తుతం మేయర్ పీఠం ఆశిస్తున్న వారిలో విజయ రెడ్డి, కవితా రెడ్డి, సింధు రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు గట్టిగానే మేయర్ పీఠం కోసం పోటీపడుతున్నారు. అయితే భారతి నగర్ డివిజన్ నుంచి గెలిచిన పి.వి.సింధు రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ అభినందించడం తో ఆమె గ్రేటర్ మేయర్ పదవిలో కూర్చోబోతున్నారు అనే విషయం అందరికీ స్పష్టత వచ్చింది. అయితే స్పష్టంగా కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఈ స్థానం సంపాదించేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. 



టిఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి భార్య వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ కవిత రెడ్డి, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకా రెడ్డి కోడలు విజయశాంతి, ఎంపీ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరంతా రెండు సార్లు గ్రేటర్ లో కార్పొరేటర్ గా గెలిచిన వారే. వీరు కాకుండా ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. కేసీఆర్ అనుగ్రహం ఎవరు పై ఉందో అనేది స్పష్టత లేదు. ఇక మేయర్ పీఠం విషయంలో ఎంఐఎం పార్టీ ఎటువంటి కండిషన్లు పెడుతుందో తెలియదు. ఆ పార్టీ నుంచి మేయర్ స్థానానికి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. లేకపోతే పదవీ కాలాన్ని చెరి సగం పంచుకునే అవకాశం కూడా ఉన్నట్టుగానే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈరోజు మేయర్ అభ్యర్థి విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.






ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు

గ్రేటర్ యుద్ధం: ఏ పార్టీకీ రాని మ్యాజిక్ ఫిగర్.. ఈసారి మేయర్ ఎన్నిక కొత్తగా?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>