MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil52d1cd9a-a822-4a63-9813-66e6e436df51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil52d1cd9a-a822-4a63-9813-66e6e436df51-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరో అయిన అక్కినేని అఖిల్ ఇటీవల అఖిల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. అతకముందు అక్కినేని మూడు తరాల కథానాయకులు నటించిన మనం సినిమా క్లైమాక్స్ సీన్స్ లో తళుక్కున తొలిసారిగా మెరిసిన అఖిల్ అందులో సర్ప్రైజింగ్ ఎంట్రీ తో మంచి పేరు దక్కించుకున్నాడు. అయితే ఆ తరువాత ఆయన హీరోగా పూర్తి స్థాయిలో తెరంగేట్రం చేసిన అఖిల్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. అనంతరం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన రెండవ సినిమా హలో కూడా కేవలం పర్వాలేదనిakhil akkineni;most eligible bachelor;venkatesh;kumaar;nidhhi agerwal;pooja hegde;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;nidhi;surender reddy;vikram;makar sakranti;tollywood;cinema;baba bhaskar;sankranthi;hero;heroine;yuva;reddy;venky atluri;adhurs;ak entertainments;hello;misterఇప్పుడేగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .... అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తాడట .....??ఇప్పుడేగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .... అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తాడట .....??akhil akkineni;most eligible bachelor;venkatesh;kumaar;nidhhi agerwal;pooja hegde;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;nidhi;surender reddy;vikram;makar sakranti;tollywood;cinema;baba bhaskar;sankranthi;hero;heroine;yuva;reddy;venky atluri;adhurs;ak entertainments;hello;misterFri, 04 Dec 2020 19:00:00 GMTఅక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరో అయిన అక్కినేని అఖిల్ ఇటీవల అఖిల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. అతకముందు అక్కినేని మూడు తరాల కథానాయకులు నటించిన మనం సినిమా క్లైమాక్స్ సీన్స్ లో తళుక్కున తొలిసారిగా మెరిసిన అఖిల్ అందులో సర్ప్రైజింగ్ ఎంట్రీ తో మంచి పేరు దక్కించుకున్నాడు. అయితే ఆ తరువాత ఆయన హీరోగా పూర్తి స్థాయిలో తెరంగేట్రం చేసిన అఖిల్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. అనంతరం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన రెండవ సినిమా హలో కూడా కేవలం పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకుంది.

ఆ తరువాత యువ దర్శకడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటించిన సినిమా మిస్టర్ మజ్ను. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో అఖిల్ యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు. అయితే దాని అనంతరం కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎస్విసిసి బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఒక సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా కానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాతో తప్పనిసరిగా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటారని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇకపొతే దాని తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్న ప్రతిష్టాత్మక సినిమాలో అఖిల్ నటించనున్నాడు, ఇటీవల దానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇది మాత్రమే కాక మరొక రెండు పవర్ఫుల్ సబ్జక్ట్స్ ని అఖిల్ లైన్ లో పెట్టాడని, ఇక రాబోయే రోజుల్లో అతడి నుండి రాబోయే సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో పాటు ఆయనకు కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని అందించడం ఖాయం అంటున్నారు. మొత్తంగా అఖిల్ మూవీ ప్లానింగ్స్ అదుర్స్ అనే చెప్పాలి.....!! 


గ్రేటర్ యుద్దం: కార్యకర్తల శ్రమ వల్లే ఈ ఘనత దక్కింది..బండి సంజయ్

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>