PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suspension-is-hunting-baded3c3de3-e56b-461d-9e0e-28b71fe58715-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suspension-is-hunting-baded3c3de3-e56b-461d-9e0e-28b71fe58715-415x250-IndiaHerald.jpgనరేగా బిల్లులపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలిచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం.. పదిమంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే.. సస్పెన్షన్‌ వేటు వేయడం దారుణమన్నారు టీడీపీ సభ్యులు. suspension‌ is hunting bad;andhra pradesh;assembly;minister;tdp;ycp;partyసస్పెన్షన్‌ వేటు వేయడం దారుణమా ?సస్పెన్షన్‌ వేటు వేయడం దారుణమా ?suspension‌ is hunting bad;andhra pradesh;assembly;minister;tdp;ycp;partyFri, 04 Dec 2020 23:00:00 GMTఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలిచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం.. పదిమంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే.. సస్పెన్షన్‌ వేటు వేయడం దారుణమన్నారు టీడీపీ సభ్యులు.

వరుసగా ఐదోరోజూ ఏపీ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై వాడివేడి చర్చ జరిగింది.ప్రధానంగా నరేగా బిల్లుల చెల్లింపు జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నరేగాకు సంబంధించిన నిధులు సంవత్సరం క్రితమే విడుదల కాగా.. వాటిని సొంత పథకాలకు గానూ దారిమళ్లించిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. సభ ఎంతకూ సద్దుమణగకపోవడంతో.. పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.

అంతకు ముందు నరేగా నిధులపై మంత్రి పేర్నినాని స్పందించారు. టీడీపీ హయాంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని... వీటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే నిధుల విడుదల ఉంటుందన్నారు. ఈ లోపే టీడీపీ సభ్యులకు ఎందుకు అంత తొందరో అర్థం కావడం లేదన్నారు పేర్నినాని.

గ్రామాలకు వైసీపీ గ్రహణం  పట్టిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు. అప్పులు చేసి, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు...తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు.

సభలో విపక్ష సభ్యులకు, అధికార పార్టీ కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు. మైక్ ఇవ్వడానికి సైతం ఇబ్బంది పెడుతూ.. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

సభలో సస్పెండైన సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల తీరునుప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. భవిష్యత్తులో పదేపదే ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీలు వేసి, తగిన నియమావళి రూపొందిస్తామన్నారు.

ప్రతిరోజూ విపక్ష సభ్యులు రచ్చచేసి, సస్పెండ్ కావడంపై.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ సభకు రావడం, ఏదో కారణం చూపి, పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేసి సస్పెండ్ కావడం గౌరవసభ్యులకు అలవాటైందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.






ఆ ఇద్దరిలో మహేష్ విలన్ ఎవరు..?

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>