PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war0fb974d5-c998-41b3-84c0-bc42c5478214-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war0fb974d5-c998-41b3-84c0-bc42c5478214-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఫలితం తేడా వస్తే ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారతాయి. అయితే ఇప్పుడు మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను పరిగణిస్తారా లేదా అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్, జీహెచ్ఎంసీ చట్టంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ న్యాయశాఖకు నోటీసులు కూడా జారీ చేసింది. greater-war;anil music;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;nizamabad;mlaగ్రేటర్ యుద్ధం: ఫలితం తేడా వస్తే ఎక్స్ అఫిషియోనే కీలకం..గ్రేటర్ యుద్ధం: ఫలితం తేడా వస్తే ఎక్స్ అఫిషియోనే కీలకం..greater-war;anil music;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;district;nizamabad;mlaFri, 04 Dec 2020 11:00:00 GMT
జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 90(1)ను సవాలు చేస్తూ నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇ.అనిల్ ‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులు పాల్గొనడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. త్వరలో మేయర్‌ ఎన్నికలు జరుగుతాయని.. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన అభ్యర్థించగా ధర్మాసనం తిరస్కరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, న్యాయశాఖ కార్యదర్శి, ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.

జీహెచ్ఎంసీలో 150మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతానికి 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మరో ఐదుగురికి ఎక్స్ అఫిషియోగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 45మంది ఎక్స్ అఫిషియోల్లో టీఆర్ఎస్ -31 ఎంఐఎం-10, బీజేపీ-2, కాంగ్రెస్-2 సభ్యులున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే మొత్తం సభ్యుల బలం గల పార్టీయే జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలను గెలిచే వీలుంటుంది. దీంతో ఒకవేళ కార్పొరేటర్ల స్థానాలు తగ్గినా, ఎక్స్ అఫిషియోల బలంతో టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మిగతా పార్టీలు ఎక్స్ అఫిషియో ఓట్లపై రగడ మొదలు పెట్టాయి. ఫలితాలు సమంగా వస్తే.. కోర్టు తీర్పే కీలకంగా మారుతుంది. 


గ్రేటర్ యుద్ధం: మా వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దు, హైకోర్ట్ కి ఎన్నికల కమీషన్ స్పష్టం

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>