Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakka-premi-vishvanath-kathika-deepam2f7986e3-78f7-46f3-81a0-4370c85f5759-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakka-premi-vishvanath-kathika-deepam2f7986e3-78f7-46f3-81a0-4370c85f5759-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు బుల్లితెర పై ఎంతో పాపులర్ అయిన షో లను వెనక్కి నెట్టి ప్రస్తుతం ఎంతో పాపులారిటీ సాధించి టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీ ఉన్న షో ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు బిగ్ బాస్. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో కి ఆ రేంజ్ లో క్రేజ్ వుంది మరి. మనకు తెలిసిన సిని సెలబ్రిటీల గురించి తెలియని విషయాలను ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ వారి మధ్య గొడవలు పెడుతూ... ప్రేమలు చిగురించేలా చేస్తూ వీటన్నింటినీ కెమెరాలు ఫోకస్ చేస్bb4;nagarjuna akkineni;shankar;cinema;telugu;bigboss;fidaaనాగార్జున కు భారీ షాక్ ఇచ్చిన వంటలక్క.. డీలా పడిన బిగ్ బాస్..?నాగార్జున కు భారీ షాక్ ఇచ్చిన వంటలక్క.. డీలా పడిన బిగ్ బాస్..?bb4;nagarjuna akkineni;shankar;cinema;telugu;bigboss;fidaaFri, 04 Dec 2020 12:00:00 GMTబిగ్ బాస్ షో. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీ ఉన్న షో  ఏది అంటే అందరు టక్కున చెప్పే పేరు బిగ్ బాస్. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షో కి ఆ రేంజ్ లో క్రేజ్ వుంది మరి. మనకు తెలిసిన సిని  సెలబ్రిటీల గురించి తెలియని విషయాలను ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ వారి మధ్య గొడవలు పెడుతూ... ప్రేమలు చిగురించేలా చేస్తూ  వీటన్నింటినీ కెమెరాలు ఫోకస్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే బిగ్బాస్ ప్రారంభమైందంటే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు.



 ఇక బిగ్బాస్ ప్రారంభం అయ్యిందంటే చాలు అంతకు ముందు వరకు టాప్ రేటింగ్ సొంతం చేసుకున్న అన్ని షో లను  వెనక్కి నెట్టి టిఆర్పి పరంగా కూడా దూసుకుపోతూ ఉంటుంది. అయితే తెలుగులో ప్రస్తుతం అన్ని షోల కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నది కార్తీకదీపం సీరియల్ కి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వంటలక్క పర్ఫామెన్స్ కు ఫిదా అయిన బుల్లితెర ప్రేక్షకులు కార్తీకదీపం వస్తుందంటే చాలు అన్ని పనులు పక్కనపడేసి టీవీలకు అతుక్కుపోతారు. టిఆర్పి రేటింగ్ విషయంలో ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం బిగ్ బాస్ షో మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం బిగ్బాస్ కంటే కార్తీకదీపం కే ఎక్కువగా టిఆర్పి రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.



 42వ వారం బార్క్ రేటింగ్స్ చూస్తే కార్తీకదీపం సీరియల్ తో పోటీపడలేక డీలా పడిపోయింది నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో. దీంతో వంటలక్క కాస్త నాగార్జున కు భారీ షాక్ ఇచ్చింది. 42వ వారం రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానాల్లో ఇష్మార్ట్ శంకర్ సినిమా తో పాటు వదినమ్మ కోయిలమ్మ మౌనరాగం సీరియల్ లు ఉన్నాయి. ఇక టాప్ రేటింగ్ టిఆర్పి సొంతం చేసుకున్న షోలలో కనీసం బిగ్బాస్ కనిపించకపోవడం గమనార్హం. ఇక ఇలా టిఆర్పి రేటింగ్స్ పరంగా బిగ్బాస్ షో ని  కార్తీకదీపం సీరియల్ వెనక్కి నెట్టడం తో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పట్లో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ బీట్ చేసే ప్రోగ్రాం రావడం కష్టంగానే కనిపిస్తోంది.


గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>