PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf369d5a7-ccf6-4a0b-8550-9bdd339d0177-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf369d5a7-ccf6-4a0b-8550-9bdd339d0177-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. అటి టీయారెస్ ఇటు బీజేపీ హోరా హోరీ పోరు అన్నది పోస్టల్ బ్యాలెట్ నుంచే కనిపిస్తోంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ చమటోడ్చి పనిచేసింది. అగ్ర నాయకులు అంతా కూడా హైదరాబాద్ వీధుల్లో కనిపించారు. మరి దానికి సరైన ఫలితం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందా అన్నదే అందరి టెన్షన్ గా ఉంది. greater-war;hyderabad;bharatiya janata party;indian postal serviceగ్రేటర్ యుద్ధం : కమల వికాసం ఖాయం ?గ్రేటర్ యుద్ధం : కమల వికాసం ఖాయం ?greater-war;hyderabad;bharatiya janata party;indian postal serviceFri, 04 Dec 2020 10:00:00 GMTబీజేపీ హోరా హోరీ పోరు అన్నది పోస్టల్ బ్యాలెట్ నుంచే కనిపిస్తోంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ చమటోడ్చి పనిచేసింది. అగ్ర నాయకులు అంతా కూడా హైదరాబాద్ వీధుల్లో కనిపించారు. మరి దానికి సరైన ఫలితం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందా అన్నదే అందరి టెన్షన్ గా ఉంది.

అయితే గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ గట్టి శక్తిగా ఆవిర్భవిస్తుంది అన్నది తొలి ట్రెండ్ లను చూస్తే అర్ధమవుతోంది. గ్రేటర్ ఓటర్ బీజేపీ మీద చూపు సారించాడు అన్న దానికి పోస్టల్ ఫలితాలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. మరింత లోతుగా వెళ్తే కొన్ని డివిజనలో కూడా బీజేపీ పట్టు కొనసాగినట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా బీజపీని ఆషామాషీగా అయితే ఈ ఎన్నికల్లో తీసివేయలేమని అంటున్నారు. టీయారెస్ కి గతసారి వచ్చిన 99 సీట్లు రావడం ఈసారి కష్టమే కావచ్చు అన్న మాట కూడా ఉంది. బీజేపీ మజ్లీస్ మీద తన రాజకీయ  బాణాలు ఎక్కుపెట్టినా సీట్లు లాగేసేది మాత్రం టీయారెస్ నుంచే అని క్లారిటీ వస్తోంది.

మరో వైపు ఎపుడూ గ్రేటర్ హైదరాబాద్ లో అతి బలంగా ఉంటే బీజేపీకి ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం కూడా ఒక టానిక్ గా పనిచేసింది. దాంతో బీజేపీ గణనీయంగా ఓట్లూ సీట్లు సాధిస్తుందని తొలి అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇవి డివిజన్ లో జరిగే ఓటింగ్ కాబట్టి చివరి ఓటు లెక్కించే వరకూ ఫలితాన్ని చూడాల్సిందే. ఒక్క ఓటు తేడాలో కూడా అటూ ఇటూ మారవచ్చు. ఏది ఏమైనా బీజేపీ కనీసం డబుల్ డిజిట్ సీట్లను ఈసారి సాధించడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే ఈసారి గ్రేటర్ మేయర్ పీఠం టీయారెస్ దే అవుతుందని అంటున్నారు. సీట్లు ఎన్ని తగ్గినా కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో టీయారెస్ పీఠం అధిరోహించడం  కచ్చితమని తేలిపోతోంది.






గ్రేటర్ యుద్ధం : గల్లీ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ పెద్దల్లో టెన్షన్..?

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>