MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi-balakrishnab56a132f-a6a0-4914-ac80-f5fb88408ad0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi-balakrishnab56a132f-a6a0-4914-ac80-f5fb88408ad0-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా తాతమ్మకల సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న బాలయ్య ఇక అక్కడి నుండి వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ కొనసాగారు. మొదటి నుంచి కూడా తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే అభిమానులు అలానే ప్రేక్షకులను అలరించే విధంగా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పలు సినిమాలు చేస్తూ కొనసాగిన బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని పాపులారిటీ తో పాటు ఎందరో పsridevi;balakrishna;chiranjeevi;ntr;balakrishna;nagarjuna akkineni;sridevi kapoor;krishna;nageshwara rao akkineni;tiru;vishwa;cinema;producer;producer1;heroine;nandamuri taraka rama rao;fatherబాలయ్య శ్రీదేవి తో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి ముఖ్య కారణం అదే ....??బాలయ్య శ్రీదేవి తో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి ముఖ్య కారణం అదే ....??sridevi;balakrishna;chiranjeevi;ntr;balakrishna;nagarjuna akkineni;sridevi kapoor;krishna;nageshwara rao akkineni;tiru;vishwa;cinema;producer;producer1;heroine;nandamuri taraka rama rao;fatherFri, 04 Dec 2020 07:00:00 GMTసినిమా పరిశ్రమకి తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా తాతమ్మకల సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న బాలయ్య ఇక అక్కడి నుండి వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ కొనసాగారు. మొదటి నుంచి కూడా తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే అభిమానులు అలానే ప్రేక్షకులను అలరించే విధంగా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పలు సినిమాలు చేస్తూ కొనసాగిన బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని పాపులారిటీ తో పాటు ఎందరో ప్రేక్షకుల మనస్సులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక తన కెరీర్ లో వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య దివంగత నటి శ్రీదేవి తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజానికి శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి భారీ విజయాలు సొంతం చేసుకొని హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఆయనతో పాటు ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో కూడా హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఇక ఆ తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ సరసన కూడా హీరోయిన్ గా నటించి తిరుగులేని నటిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే ఆమె కేవలం ఒక్క బాలకృష్ణ సరసన మాత్రమే హీరోయిన్ గా నటించకపోవటానికి ఒక బలమైన కారణం ఉందని సమాచారం.

నిజానికి ఒక బడా ప్రొడ్యూసర్ మరియు దర్శకుడు అప్పట్లో శ్రీదేవి, బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమాను సిద్ధం చేశారని కాగా ఆ సినిమాని ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో హీరోయిన్ గా శ్రీదేవితో నేను చేయలేను అంటూ బాలయ్య చెప్పారట. అయితే దానికి కారణం శ్రీదేవి పై తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, నాన్న గారితో మానవరాలిగా, హీరోయిన్ గా నటించిన ఆమె సరసన తాను హీరోయిన్ గా నటించలేనని దయచేసి తనని ఇబ్బంది పెట్టవద్దని ఆ సినిమా అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారట బాలయ్య. ఇక ఆ తర్వాత నుంచి మరెప్పుడూ కూడా ఆమెతో కలిసి నటించే అవకాశం బాలయ్య రాలేదు. ఇక అప్పట్లో ఒకానొక సందర్భంలో బాలయ్యతో సినిమా చేయకపోవటం విషయమై శ్రీదేవి మాట్లాడుతూ కావాలని ఆయనతో సినిమా చేయకపోవడం అనే ఉద్దేశం తనకు లేదని, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ లనే బాలయ్య కూడా మంచి నటుడని అయితే అనుకోకుండా అలా జరిగిపోయింది తప్ప వేరే కారణం ఏమీ లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే అప్పటి దిగ్గజ నటులు అందరితో కలిసి హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఒక్క బాలయ్య సరసన మాత్రమే హీరోయిన్ గా చేయకపోవటం ఒక రకంగా యాదృచ్చికమే అంటున్నారు విశ్లేషకులు.....!!





గ్రేటర్ యుద్ధం : ఫలితాలపై.. యూపీ ప్రజలు ఆసక్తి.. ఎందుకో తెలుసా..?

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?

గ్రేటర్ యుద్ధం : లెక్కలు తేలనున్నాయి.. జాతకాలు మారనున్నాయి..?

బిజెపి ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా...?

గ్రేటర్ యుద్ధం: ఈసీ కీలక నిర్ణయం, హైకోర్ట్ కు బిజెపి

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>