PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders02d03fce-81aa-4071-8682-917c8a19e468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders02d03fce-81aa-4071-8682-917c8a19e468-415x250-IndiaHerald.jpgభారత్‌లో మెరుగైన ప్రతిభను కనబురుచుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న పోలీస్‌ స్టేషన్లలో జాబితాలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ టాప్10లో నిలిచింది. 2020 ఏడాదికి సంబంధించిన ఈ జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ప్రతి ఏడాది కేంద్ర హోం శాఖ ఈ జాబితాను విడుదల చేస్తుంది. అన్ని విభాగాల్లో పోలీస్‌ స్టేషన్ల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. పోలీస్ స్టేషన్లకు ప్రతి ఏడాది ఈ ర్యాంకులు ఇవ్వాలని 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్jammikunta;geetha;tara;goa;andaman;telangana;uttar pradesh;narendra modi;district;huzur nagar;police;prime minister;2020;press;police station;traffic police;central government;karimnagar;narendraజ‌మ్మికుంట పోలీస్ స్టేష‌న్ విశిష్ట‌త అదే... అందుకే ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చిందిగా..!జ‌మ్మికుంట పోలీస్ స్టేష‌న్ విశిష్ట‌త అదే... అందుకే ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చిందిగా..!jammikunta;geetha;tara;goa;andaman;telangana;uttar pradesh;narendra modi;district;huzur nagar;police;prime minister;2020;press;police station;traffic police;central government;karimnagar;narendraFri, 04 Dec 2020 09:00:00 GMTకరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ టాప్10లో నిలిచింది. 2020 ఏడాదికి సంబంధించిన ఈ జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ప్రతి ఏడాది కేంద్ర హోం శాఖ ఈ జాబితాను విడుదల చేస్తుంది. అన్ని విభాగాల్లో పోలీస్‌ స్టేషన్ల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. పోలీస్ స్టేషన్లకు ప్రతి ఏడాది ఈ ర్యాంకులు ఇవ్వాలని 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు విడుదల చేస్తోంది. దేశంలోని 16,671 పోలీసు స్టేషన్ల పనితీరుని పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. చివరకు ప్రతి రాష్ట్రం నుంచి ఒకటి లేదా రెండు పోలీసు స్టేషన్లు జాబితాలో నిలుస్తాయి. వాటిల్లో టాప్10 పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేస్తారు.



ఈ ఏడాది టాప్10 పోలీస్ స్టేషన్లు.. 1.మణిపూర్ తౌబల్ నాంగ్‌పోక్ జిల్లాలోని ‌సెక్మయి, తమిళనాడు సేలం జిల్లాలోని ఏడబ్ల్యూపీఎస్ సురమంగళం, అరుణాచల్ ప్రదేశ్ చాంగ్లాంగ్ జిల్లాలోని ఖర్సాంగ్ పోలీస్ స్టేషన్, ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్ జిల్లాలోని జిల్మిలి (భయ థానా) స్టేషన్గో వాలోని దక్షిణ గోవా జిల్లాలోని సాంగుమ్ స్టేషన్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉత్తరమధ్య అండమాన్ జిల్లాలోని కలిఘాట్ పోలీసు స్టేషన్, సిక్కిం తూర్పు జిల్లాలోని పాక్యాంగ్ స్టేషన్, ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని కాంత్ స్టేషన్దా ద్రా నగర్ హవేలిలోని దాద్రా అండ్ నగర్ హవేలి ఖాన్వెల్ స్టేషన్, తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట నగర పోలీస్ స్టేషన్ ఉన్నాయి.



దేశంలో ఎక్కడా లేని విధంగా జమ్మికుంట వాసులు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటారు.  జ‌మ్మికుంటలో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 గం.ల‌కు ఊరు మొత్తం స్పీక‌ర్ల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న వినిపిస్తుంది. జాతీయ గీతం విన‌ప‌డ‌గానే ఎక్క‌డి వారు అక్క‌డే త‌మ ప‌నుల‌ను ఆపేసి, గీతం పూర్త‌య్యే వ‌ర‌కు నిల్చొని సెల్యూట్‌ చేస్తారు. ఇందుకోసం పోలీసులు ప‌ట్ట‌ణంలోని ప్రధాన ప్రాంతాల్లో స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. జాతీయ గీతం ప్రారంభ‌మ‌వ‌డానికి ఐదు నిమిషాల ముందు ఒక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. దాంతో ప్ర‌జ‌లంతా సిద్ధ‌మ‌వుతారు. త‌ర్వాత జ‌న‌గ‌ణ‌మ‌న వ‌స్తున్న 52 సెక‌న్ల పాటు వారు నిల్చునే ఉంటారు. జ‌మ్మికుంట ప్ర‌జ‌లు చూపిన జాతీయ స్ఫూర్తిని రాష్ట్ర‌ప‌తి కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి మోదీ స‌హా అనేక మంది కొనియాడారు.




ఏపీ లో బీజేపీ అతిదూకుడు ఎవరి కొంప ముంచుతుంది..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>