MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/athadu-mahesh-babu-trivikram16f801ed-7fc2-42ea-846c-93282506e6a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/athadu-mahesh-babu-trivikram16f801ed-7fc2-42ea-846c-93282506e6a4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా త్రిష హీరోయిన్ గా నటించింది. గుహన్ కెమెరా మ్యాన్ గా పని చేసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు మురళీమోహన్ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. athadu;mahesh babu trivikram;mahesh;trisha krishnan;mani sharma;murali mohan;trivikram srinivas;cinema;rajani kanth;media;comedy;husband;heroine;success;gmb entertainments;khaleja'అతడు' కి అమ్మ మొగుడులా ఉంటుందట ...?'అతడు' కి అమ్మ మొగుడులా ఉంటుందట ...?athadu;mahesh babu trivikram;mahesh;trisha krishnan;mani sharma;murali mohan;trivikram srinivas;cinema;rajani kanth;media;comedy;husband;heroine;success;gmb entertainments;khalejaFri, 04 Dec 2020 16:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా త్రిష హీరోయిన్ గా నటించింది. గుహన్ కెమెరా మ్యాన్ గా పని చేసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు మురళీమోహన్ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఇక రిలీజ్ అనంతరం ఈ సినిమాలోని సాంగ్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సీన్స్, తో పాటు ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా డైలాగ్స్ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఈ సినిమా అనంతరం సూపర్ స్టార్ తో మరొకసారి ఖలేజా సినిమా చేసారు త్రివిక్రమ్. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయింది. మహేష్ బాబు తనలోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని ప్రదర్శించిన ఈ సినిమా యొక్క కథ, కథనాలు ఆకట్టుకునేలా లేకపోవడంతో ప్రేక్షకులు ఖలేజా ని తిరస్కరించారు. ఇక అతి త్వరలో మళ్ళీ పదేళ్ల తరువాత సూపర్ స్టార్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి పలు మీడియా మాధ్యమాల్లో కొద్దిరోజుల నుండి వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా కథ ప్రకారం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా అలానే పలు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సీన్స్ కలగలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఖలేజా తో మిస్ అయిన తామిద్దరి కాంబినేషన్ సక్సెస్ ని ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో కొట్టేలా సిద్దమవుతున్నారట త్రివిక్రమ్. అలానే ఓవరాల్ గా ఈ సినిమా అతడు మూవీ కి అమ్మ మొగుడులా ఉంటుందని టాక్. మొత్తంగా చూసుకుంటే రాబోయే మరికొద్దిరోజుల్లో మహేష్, త్రివిక్రమ్ కాంబో సినిమా అదిరిపోనున్నట్లు తెలుస్తోంది....!!


గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>