MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-only-mahesh-babu-and-pawan-kalyan-were-suffering-like-thised9996d1-1461-42d6-995f-56842e26cf53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/why-only-mahesh-babu-and-pawan-kalyan-were-suffering-like-thised9996d1-1461-42d6-995f-56842e26cf53-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట అతి త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అలానే మహేష్ అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. మరోవైపు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ ఈ సర్కారు వారి పాట తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని తదుపరి హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాpawan kalyan;mahesh babu;pawan;mahesh;prakash raj;shruti haasan;suresh;anjali;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;pawan kalyan;raj;sriram;thaman s;makar sakranti;cinema;rajani kanth;sankranthi;january;heroine;success;yuva;agnyaathavaasi;research and analysis wing;venu sreeram;dilప్చ్ ..... పాపం మహేష్, పవన్ లకే .... ఇలా ఎందుకు జరుగుతుందో ....??ప్చ్ ..... పాపం మహేష్, పవన్ లకే .... ఇలా ఎందుకు జరుగుతుందో ....??pawan kalyan;mahesh babu;pawan;mahesh;prakash raj;shruti haasan;suresh;anjali;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;pawan kalyan;raj;sriram;thaman s;makar sakranti;cinema;rajani kanth;sankranthi;january;heroine;success;yuva;agnyaathavaasi;research and analysis wing;venu sreeram;dilFri, 04 Dec 2020 08:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట అతి త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అలానే మహేష్ అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. మరోవైపు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ ఈ సర్కారు వారి పాట తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని తదుపరి హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు రెండున్నరేళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయం అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాని అనంతరం చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.

యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా అందాల నటి శృతిహాసన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదాథామస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే నిజానికి మహేష్ బాబు నటించనున్న సర్కారు వారి పాట సినిమా ఈ ఏడాది మే తర్వాత పట్టాలెక్కాల్సింది. అయితే అదే సమయంలో కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ఎనిమిది నెలల నుంచి షూటింగ్ పొడిగింప పడుతూ వస్తోంది. మరోవైపు ఇటీవల ఈ సినిమా షూటింగ్ ని అమెరికాలో ప్రారంభించాలని చూసిన సర్కారు వారి పాట యూనిట్ ఒక్కసారిగా అక్కడ విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో షూటింగ్ ని మరొక రెండు నెలల పాటు వాయిదా వేసింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయనున్నారట. మరోవైపు వకీల్ సాబ్ సినిమా కూడా ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో రిలీజ్ కావాల్సింది.

అయితే దీనికి కూడా కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ బాగా దెబ్బ వేయటంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మరి కొన్నాళ్ళ పాటు వాయిదా పడిందని మిగిలిన కొంత భాగం షూటింగ్ ని జనవరి తర్వాత తీయనున్నారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదని ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో వచ్చే అవకాశం ఉందని వార్తలు కూడా అందుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ ఇటు మహేష్ బాబు సినిమాలు కొన్ని నెలల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ మెల్లగా నత్తనడకన ముందుకు సాగుతుండటంతో వారి అభిమానులు కూడా కొంత నిరుత్సాహ పడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలు కూడా ఎప్పటికి షూటింగ్ పూర్తయి థియేటర్స్ లోకి వస్తాయో తెలియాలి అంటే మరికొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు.....!!




నేడుతెరచుకోనున్నమల్టిఫ్లెక్స్ లు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోఎనిమిది నెలల తర్వాత నేడు ప్రారంభం

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?

గ్రేటర్ యుద్ధం : లెక్కలు తేలనున్నాయి.. జాతకాలు మారనున్నాయి..?

బిజెపి ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా...?

గ్రేటర్ యుద్ధం: ఈసీ కీలక నిర్ణయం, హైకోర్ట్ కు బిజెపి

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>