MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie-newsfd07c1ca-70e8-42d7-92d0-2d70bb1212a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie-newsfd07c1ca-70e8-42d7-92d0-2d70bb1212a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు డిసెంబర్ 9న జరగబోయే మెగా డాటర్ నిహారిక పెళ్ళికి ఫ్యామిలీ తో పాటు తరలి వెళ్లనున్నారు. ఆ తర్వాతే మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనుకోని కారణాలవల్ల ఆచార్య సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.... కానీ ఆఫ్టర్ నిహారిక పెళ్లి తరువాత ఆచార్య సినిమా షూటింగ్ కి స్పీడ్ పెంచనున్నారు చిరు.acharya movie news;chiranjeevi;mithra;niharika konidela;hyderabad;cinema;marriage;december;anandamఆచార్య మూవీ షూటింగ్ కి బ్రేక్...కారణాలివే...?ఆచార్య మూవీ షూటింగ్ కి బ్రేక్...కారణాలివే...?acharya movie news;chiranjeevi;mithra;niharika konidela;hyderabad;cinema;marriage;december;anandamFri, 04 Dec 2020 13:00:00 GMTనిహారిక పెళ్లి సందడి అందరిని ఆనందంలో ముంచెత్తుతోంది. నాగబాబు  గారాల కూతురు నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. కరోనా నేపథ్యంలో... కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఆ తర్వాత 11వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్‌ కూడా భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ పెళ్లికి చిరు హాజరు కాబోతున్నారు అన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇదిలా ఉంటే....  గత నెలలో ఆచార్య సెట్స్ లో మెరవాల్సిన మెగాస్టార్ చిరంజీవి మిస్ చేశారు. చిరు కు కోవిడ్ 19 టెస్ట్ లో పాజిటివ్ రావడంతో... షూటింగ్ కి బ్రేక్ చెప్పి ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. మెగాస్టార్ కు కరోనా సోకిన కారణంగా ముందే ప్లానింగ్ చేసుకున్న షెడ్యూల్స్ కాస్తా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చిరుకి ఇలా జరగడం మంచి సంకేతం కాదని భావించిన ఆచార్య టీం.. బాగా ఆలోచించి షెడ్యూల్ కి మరో మంచి తేదీని చూసి ఫిక్స్ చేసుకుంది. ఈ సారీ ఎటువంటి ఆటంకాలు రాకూడదని కోరుకుంటోంది.

అయితే కోవిడ్ నుండి కోలుకున్న చిరు మరింత జాగ్రత్తలు తీసుకుని... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిన్న సెట్స్ కి వచ్చి చిత్రీకరణ తిరిగి ప్రారంభించారని తాజా సమాచారం అందింది. ఇప్పటికే  చిరుతో ఒక ప్రత్యేక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు డిసెంబర్ 9న జరగబోయే మెగా డాటర్ నిహారిక పెళ్ళికి ఫ్యామిలీ తో పాటు తరలి వెళ్లనున్నారు. ఆ తర్వాతే మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనుకోని కారణాలవల్ల ఆచార్య సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.... కానీ ఆఫ్టర్ నిహారిక పెళ్లి తరువాత ఆచార్య సినిమా షూటింగ్ కి స్పీడ్ పెంచనున్నారు చిరు. 


చుక్కలు చూపిస్తున్న రెండు బ్యాంకులు.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>