PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp866ee39c-b666-4101-8675-9e9c5ee70556-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp866ee39c-b666-4101-8675-9e9c5ee70556-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 స్థానాల దరికి చేరింది. చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. అధికార టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతూనే.. బీజేపీకి ఏకంగా 49 స్థానాలు కట్టబెట్టారు ఓట్లరు. ఎవ్వరూ ఊహించని విధంగా పలు స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ .greater war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;రాజీనామా;mim party;janasena party;partyగ్రేటర్ యుద్ధం : గట్టి పోటీ ఇచ్చి పుంజుకున్న బీజేపీ..క్రెడిట్ ఎవరికి ?గ్రేటర్ యుద్ధం : గట్టి పోటీ ఇచ్చి పుంజుకున్న బీజేపీ..క్రెడిట్ ఎవరికి ?greater war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;congress;రాజీనామా;mim party;janasena party;partyFri, 04 Dec 2020 21:27:46 GMTగ్రేటర్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 స్థానాల దరికి చేరింది. చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. అధికార టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతూనే.. బీజేపీకి  ఏకంగా 49 స్థానాలు కట్టబెట్టారు ఓట్లరు. ఎవ్వరూ ఊహించని విధంగా పలు స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. 


గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ .. ఇప్పుడు కేవలం 56 స్థానాలకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమై సాధించిన బీజేపీ .. 49 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఎంఐఎం పార్టీ ఓ స్థానం కోల్పోయి 43 స్థానాలు నిలబెట్టుకుంది. ఓల్డ్ సిటీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విజయం కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమేనన్నారు బీజేపీ నేతలు. 


ఇక గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది . కేవలం రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, కాంగ్రెస్ పీసీసీ అధక్ష పదవికి... ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ గెలుపుకోసం ఆ పార్టీ అగ్ర నేతలు సహా, జనసేన కార్యకర్తల దాకా చాలా మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాటు పడ్డారు. దీంతో ఇప్పుడు ఈ గెలుపు క్రెడిట్ ఎవరికీ దక్కుతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.




అవినాష్ స్టామినా ప్రూవ్ అయ్యింది.. ఇదంతా వారిపనే..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>