PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-ghmc-elections-tdp-washed-out-bjp-trs-kcrde32444c-8846-4eb4-8f8b-cb0a919df496-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-ghmc-elections-tdp-washed-out-bjp-trs-kcrde32444c-8846-4eb4-8f8b-cb0a919df496-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల హడావుడి పూర్తయింది. దాదాపుగా టీఆర్ఎస్ తరువాత బిజెపి అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకుంది. ఇక టీఆర్ఎస్ అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకున్నా ఎంఐఎం సపోర్ట్ లేకుండా మేయర్ స్థానం దక్కించుకోవడం అయితే కష్టమనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేనిది బిజెపి భారీగా బలం పుంజుకుని దాదాపు 47 స్థానాలు ఎగబాకి టిఆర్ఎస్ కు చేరువయ్యింది. ఎప్పటిలాగే మజ్లిస్ పార్టీ కూడా తనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు గెలిచిన 42 స్థానాలు తెచ్చుకుంది. అయితే గత ఎన్నికల్లో మంచి నెంబరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోర greater war;lokesh;balakrishna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;tdp;lokesh kanagaraj;party;mantraగ్రేటర్ యుద్ధం : 106 స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయిన టీడీపీగ్రేటర్ యుద్ధం : 106 స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయిన టీడీపీgreater war;lokesh;balakrishna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;tdp;lokesh kanagaraj;party;mantraFri, 04 Dec 2020 20:00:55 GMTగ్రేటర్ ఎన్నికల హడావుడి పూర్తయింది. దాదాపుగా టీఆర్ఎస్ తరువాత బిజెపి అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకుంది. ఇక టీఆర్ఎస్ అందరి కంటే ఎక్కువ స్థానాలు తెచ్చుకున్నా  ఎంఐఎం సపోర్ట్ లేకుండా మేయర్ స్థానం దక్కించుకోవడం అయితే కష్టమనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేనిది బిజెపి భారీగా బలం పుంజుకుని దాదాపు 47 స్థానాలు ఎగబాకి టిఆర్ఎస్ కు చేరువయ్యింది. ఎప్పటిలాగే మజ్లిస్ పార్టీ కూడా తనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు గెలిచిన 42 స్థానాలు తెచ్చుకుంది. అయితే గత ఎన్నికల్లో మంచి నెంబరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోర ఓటమి పాలైంది. అలాగే టీడీపీ కూడా చెప్పుకోలేని విధంగా 106 స్థానాల్లో పోటీ చేసి పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. 

నిజానికి ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్న ఆశ నమ్మకం ఎవరికీ లేద., అందుకే ప్రచారానికి కూడా కనీసం ఒక్క అగ్రనేత కూడా పాల్గొనలేదు. కేవలం తెలంగాణ టిడిపిలో యాక్టివ్ గా ఉన్న కొందరు నాయకులు మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారు. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిందన్న అపవాదు కూడా ఆ పార్టీ మీద ఉంది. ఈ క్రమంలో 106 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఆ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయి పరువు తీసుకుందని చెప్పొచ్చు. 

నిజానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో తెలంగాణకి తామే ప్రత్యామ్నాయం అన్నట్టు టిడిపి గట్టిగా ప్రచారం చేసుకుంది. అప్పుడు కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ని ఎలా అయినా ఓడించాలని చంద్రబాబు సహా లోకేష్ బాలకృష్ణ అలాగే ఏపీకి చెందిన అప్పటి మంత్రులు చాలా మంది తెలంగాణలో ప్రచారం చేశారు. కానీ నీ టిఆర్ఎస్ వేవ్ కి తట్టుకోలేక పోయి ఘోర ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఒక రకంగా చంద్రబాబు తెలంగాణ టిడిపికి దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. కేవలం ఎల్.రమణకు బాధ్యతలు అప్పగించి అప్పుడప్పుడు పరిస్థితులు గమనించడం తప్ప ఆయన సరిగా పార్టీని పట్టించుకోవడం లేదని పార్టీ క్యాడర్ లోనే బలమైన నా అభిప్రాయం నాటుకుపోయింది.


మోనాల్ ను వదిలేలా లేని నాగార్జున.. భారీ ఆఫర్..?

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>