PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war49b57b53-1bf5-4909-a582-b99123b7248f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war49b57b53-1bf5-4909-a582-b99123b7248f-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిసెంబర్ ఒకటిన జరిగిన (జీహెచ్ఎంసీ) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. చాలాకాలం తర్వాత మరలా ఇప్పుడు ఈ ఎన్నికలకు బ్యాలెట్ పద్ధతిలో ఓట్ల పోలింగ్ జరిగింది. అయితే ఈసారి పెన్నుతో టిక్ పెట్టిన ఓటు వేసినట్లే అంటూ ఎస్ఈసీ సర్య్కూలర్ జారీ చేసింది. స్వస్తిక్ ముద్ర తో పాటు ఏ గుర్తు ఉన్న ఓటు గా పరిగణించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది.greater-war;hyderabad;bharatiya janata party;telangana;high court;telugu;police;capital;court;december;election commissionస్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీస్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీgreater-war;hyderabad;bharatiya janata party;telangana;high court;telugu;police;capital;court;december;election commissionFri, 04 Dec 2020 09:30:00 GMTతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిసెంబర్ ఒకటిన జరిగిన (జీహెచ్ఎంసీ) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. చాలాకాలం తర్వాత మరలా ఇప్పుడు ఈ ఎన్నికలకు బ్యాలెట్ పద్ధతిలో ఓట్ల పోలింగ్ జరిగింది. అయితే ఈసారి పెన్నుతో టిక్ పెట్టిన ఓటు వేసినట్లే అంటూ ఎస్ఈసీ సర్య్కూలర్ జారీ చేసింది. స్వస్తిక్ ముద్ర తో పాటు ఏ గుర్తు ఉన్న ఓటు గా పరిగణించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. దీంతో ఈ సర్క్యూలర్‌పై బీజేపీ కోర్టుకెక్కింది. పెన్నుతో టిక్ పెట్టిన ఓటును లెక్కించాలన్న కొత్త సర్క్యూలర్‌పై బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ ‌ ప్రారంభం అయ్యింది. దీంతో 150 డివిజన్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. 150 డివిజన్లలో 30 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.



ఓట్ల కౌంటింగ్ సెంటర్ల వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. 50వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరం వరకు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల వరకు నగరంలో ఆంక్షలు కొనసాగుతాయి. ఇక బల్దియాలో 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరిగింది. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో 34,50,331 మంది.. 46.55 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్ జరిగింది.




గ్రేటర్ యుద్ధం :కౌంటింగ్ ఉద్యోగుల ఆగ్రహం

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>