MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multiplex-opening6618f951-4ebc-4d83-a052-9542ef900636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multiplex-opening6618f951-4ebc-4d83-a052-9542ef900636-415x250-IndiaHerald.jpgసినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బతో 8నెలలుగా మూతబడిన థియేటర్లు ఎట్టకేలకు శుక్రవారం నుంచి తెరచుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచే కొన్ని ప్రధాన మల్టీప్లెక్స్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్‌, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, పీవీఆర్‌, దేవీ 70ఎం.ఎం వంటి థియేటర్లు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లను ప్రారంభిmultiplex opening;auto;cinema;chitramనేడుతెరచుకోనున్నమల్టిఫ్లెక్స్ లు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోఎనిమిది నెలల తర్వాత నేడు ప్రారంభంనేడుతెరచుకోనున్నమల్టిఫ్లెక్స్ లు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోఎనిమిది నెలల తర్వాత నేడు ప్రారంభంmultiplex opening;auto;cinema;chitramFri, 04 Dec 2020 08:56:13 GMTతెరచుకోనున్న మల్టిఫ్లెక్స్ లు
ఎనిమిది నెలల తర్వాత నేడు ప్రారంభం


సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బతో 8నెలలుగా మూతబడిన థియేటర్లు ఎట్టకేలకు శుక్రవారం నుంచి తెరచుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచే కొన్ని ప్రధాన మల్టీప్లెక్స్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్‌, ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, పీవీఆర్‌, దేవీ 70ఎం.ఎం వంటి థియేటర్లు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లను ప్రారంభించాయి. అంతేకాదు కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా   పాటిస్తున్నదీ.. ప్రత్యేక వీడియోల ద్వారా తెలియజేస్తూ.. ప్రేక్షకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ థియేటర్లలో ప్రదర్శితం కానున్న చిత్రాల్లో ‘టెనెట్‌’ అనే కొత్త ఆంగ్ల చిత్రంతో పాటు ఇప్పటికే విడుదలైన  ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అర్జున్‌రెడ్డి’, ‘ఇస్మార్ట్‌శంకర్‌’ వంటి పాత  సినిమాలూ ఉన్నాయి. వీటిలో హాలీవుడ్‌ సినిమా ‘టెనెట్‌’పైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంగ్ల  దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పటికే విదేశాల్లో విడుదల కాగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితం కానుంది. దీన్ని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సినిమా ప్రదర్శన కు థియేటర్ల ను సిద్ధం చేస్తున్నారు. దీంతో సినీ పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. పలువురికి ఉపాధి లభించనుంది.


ఏపీ లో బీజేపీ అతిదూకుడు ఎవరి కొంప ముంచుతుంది..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>