MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-mouth-is-not-under-control-hence-legal-notices3dcdda55-3a79-427b-bebf-4a5d1d32cf43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-mouth-is-not-under-control-hence-legal-notices3dcdda55-3a79-427b-bebf-4a5d1d32cf43-415x250-IndiaHerald.jpgనోరు అదుపులో ఉంచుకోలేని కంగన రనౌత్‌..ఈ సారి చేతిని కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. కంగన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమెను మరోసారి వివాదాల్లోకి లాగింది. చివరికి ఈ వ్యవహారం లీగల్‌ నోటీసుల దాకా వెళ్లింది. ఈ వ్యవహారం కంగన వర్సెస్ పంజాబీ సింగర్‌ దుల్జిత్‌గా మారింది. mouth is not under control hence legal notices;kangana ranaut;delhi;punjabiనోరు అదుపులో లేదు.. అందుకే లీగల్ నోటీసులు..!నోరు అదుపులో లేదు.. అందుకే లీగల్ నోటీసులు..!mouth is not under control hence legal notices;kangana ranaut;delhi;punjabiFri, 04 Dec 2020 23:15:00 GMTకంగన రనౌత్‌..ఈ సారి చేతిని కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. కంగన సోషల్ మీడియాలో చేసిన  ఓ పోస్ట్ ఆమెను మరోసారి వివాదాల్లోకి లాగింది. చివరికి ఈ వ్యవహారం లీగల్‌ నోటీసుల దాకా వెళ్లింది. ఈ వ్యవహారం కంగన వర్సెస్ పంజాబీ సింగర్‌ దుల్జిత్‌గా మారింది.

ప్రతీ విషయంలోనూ తనదైన మార్క్‌ చూపించే కంగన.. రైతుల ఆందోళనపై సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్  ఆమెకు చిక్కులు తీసుకొచ్చింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న  ఓ సిక్కు వృద్దురాలి గురించి ప్రస్తావిస్తూ.. 100 రూపాయిలు ఇస్తే చాలు ఇలాంటి ఆందోళనకు వచ్చేస్తారంటూ.. కంగన పేర్కొంది. దీనిపై విమర్శలు వెల్లువ కావడంతో.. ఆ పోస్ట్ ను కొద్ది సేపటికే డిలీట్‌ చేసింది కంగన.

సిక్కు వృద్ధురాలు  చేసిన కంగన పోస్ట్ పై పంజాబీ సింగర్‌ దల్జిత్‌ విమర్ళలు కురిపించాడు. దల్జిత్‌ పోస్ట్ కు కంగన స్పందిస్తూ.. నువ్వు కరణ్‌జోహార్‌ పెంపుడు జంతువు. పౌర చట్టం కోసం ఆందోళన చేసిన బామ్మే.. ప్రస్తుతం రైతుల నిరసనలో పాల్గొందని ఓ పోస్ట్ చేశాను. నీ డ్రామా ఏమిటి అంటూ సింగర్‌కు రిప్లై ఇచ్చింది కంగన. దల్జిత్‌ సమాధానమిస్తూ.. నువ్వు కలిసి పనిచేసిన వాళ్లందరికి నువ్వు పెంపుడు జంతువేనా? .. ఈలెక్కన ఈ జాబితా పెద్దదే అంటూ వ్యంగ్యంగా చమత్కరించాదు దుల్జిత్‌. బాలీవుడ్డే కాదు.. పంజాబీల భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో నీకు తెలుసంటూ ఘాటుగా స్పందించాడు ద ల్జిత్.

పౌరచట్టంలో ఆందోళన చేసిన బామ్మ.. రైతుల నిరసనలో పాల్గొన్న బామ్మ ఒక్కరు కాదని తేలడంతో.. నెటిజన్లు.. కంగన తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాకు లీగల్‌ నోటీసులు ఇచ్చింది. కంగన క్షమాపణ చెప్పాలని కమిటీ అధ్యక్షుడు డిమాండ్‌ చేశాడు.

ఇదిలా ఉండగా.. రైతుల ఆందోళనలో పాల్గొన్న మొహిందర్‌ కౌర్‌  కంగనకు మాటలతో కౌంటర్‌ ఇచ్చింది. 100 రూపాయిలకు ఆందోళనలో పాల్గొనాల్సిన అవసరం లేదని.. తన పొలంలో పత్తి తీసే కూలీకి రోజుకు 300 ఇస్తానని.. కంగన వస్తే.. 400 ఇస్తానంటోంది దాదీ.  పాలు తీసి.. పేడ ఎత్తితే.. 500 ఇస్తానని పేర్కొన్న వృద్ధురాలి మాటలు నెట్‌లో ముద్దుముద్దుగా వైరల్‌ అవుతున్నాయి. కంగనకు నీవే కరెక్ట్‌ అంటూ.. కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. అందరికీ కౌంటర్‌ ఇచ్చే కంగన.. మొహిందర్‌ కౌర్‌కు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.  




గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>