Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-and-super-star-in-one-moviebf4dbb34-efa3-4113-aa7a-1e5d2d056b4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-and-super-star-in-one-moviebf4dbb34-efa3-4113-aa7a-1e5d2d056b4c-415x250-IndiaHerald.jpgతెలుగు తెరపై మల్టీస్టారర్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఓ హీరో సినిమాలో మరో హీరో కొంతసేపు మాత్రమే కనిపించినా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతారు. ఒకవేళ ఆ ఇద్దరూ స్టార్ హీరోలైతే ఇక ఆ సినిమాకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఛాన్సే తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్...pawan mahesh;pawan;mahesh;pooja hegde;suresh;kalyan;keerthi suresh;kirti;krish;kushi;parasuram;pawan kalyan;ram pothineni;shankar;sriram;cinema;rajani kanth;january;king;director;hero;king 1;banking;venu sreeram;kickఒకే సినిమాలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!ఒకే సినిమాలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!pawan mahesh;pawan;mahesh;pooja hegde;suresh;kalyan;keerthi suresh;kirti;krish;kushi;parasuram;pawan kalyan;ram pothineni;shankar;sriram;cinema;rajani kanth;january;king;director;hero;king 1;banking;venu sreeram;kickFri, 04 Dec 2020 21:28:54 GMTసినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఓ హీరో సినిమాలో మరో హీరో కొంతసేపు మాత్రమే కనిపించినా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతారు. ఒకవేళ ఆ ఇద్దరూ స్టార్ హీరోలైతే ఇక ఆ సినిమాకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఛాన్సే తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ అభిమానులకు, సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఈ వార్త భారీ కిక్ ఇస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్‌ని పంచుకోబోతున్నారట.


పవన్ కళ్యాన్ రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. రాజకీయాలతో బిజీ బిజిగా గడిపారు. ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ప్రస్తుతం 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, సాగర్ కే చంద్ర, హరీశ్ శంకర్ లాంటి దర్శకులతో సినిమాలు కూడా ఇప్పటికే పవన్ డైరీలో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం దర్శక, నిర్మాతలు పవన్ కళ్యాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కేవలం 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందట. అందుకే ఈ రోల్ పవన్‌తో చేయిస్తే సినిమాపై మరింత అంచనాలు పెరుగుతాయని డైరెక్టర్ భావిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ రోల్‌లో నటించడానికి పవన్ ‘ఎస్’ చెప్పారనే టాక్ నడుస్తోంది.

సర్కారు వారి పాట మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి మహేశ్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, భారీ స్కామ్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు డైరెక్టర్ పరశురామ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు.




అవినాష్ స్టామినా ప్రూవ్ అయ్యింది.. ఇదంతా వారిపనే..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>