Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/smoking572187ff-bf74-4592-9a2a-b16ca2daa047-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/smoking572187ff-bf74-4592-9a2a-b16ca2daa047-415x250-IndiaHerald.jpgసిగరెట్ తాగడమంటే కుర్రకారుకు ఓ సరదా. స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ గొప్పగా ఫీలవుతుంటారు యంగ్‌స్టర్స్. అయితే ఆ సిగరెట్ కాల్చడం ఎంత స్టైల్‌గా ఉంటుందో పక్కన పెడితే.. దానివల్ల వచ్చే అనర్థాలు లెక్కలేనన్ని. ఈ నేపథ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా..? ..smoking;amala akkineni;hema;hemanth;vidya;ram madhav;government;cigarette;hookah;research and analysis wing;masala;jharkhand;ranchiసిగరెట్ తాగితే నో ఉద్యోగం.. గవర్నమెంట్ ఆర్డర్సిగరెట్ తాగితే నో ఉద్యోగం.. గవర్నమెంట్ ఆర్డర్smoking;amala akkineni;hema;hemanth;vidya;ram madhav;government;cigarette;hookah;research and analysis wing;masala;jharkhand;ranchiFri, 04 Dec 2020 23:28:08 GMTరాంచీ: సిగరెట్ తాగడమంటే కుర్రకారుకు ఓ సరదా. స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ గొప్పగా ఫీలవుతుంటారు యంగ్‌స్టర్స్. అయితే ఆ సిగరెట్ కాల్చడం ఎంత స్టైల్‌గా ఉంటుందో పక్కన పెడితే.. దానివల్ల వచ్చే అనర్థాలు లెక్కలేనన్ని. ఈ నేపథ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసా..? ధూమపానం అంటే సిగరెట్ చేయని వారినే ఉద్యోగాలంటూ ప్రకటించింది. అంతేకాదు పొగాకు నమలడాన్ని కూడా నిషేధించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింగ్ దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.   
   
జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల తమ కార్యాలయాలను పొగాకు రహిత మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సర్కార్ సిగరెట్ తాగేవారికి, పొగాకు నమిలే వారికి అక్కడ స్థానం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు కూడా తాము ధూమపానం చేయమని, పొగాకు నమలమని పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోయే వారు కూడా తాము ధూమపానం చేయమని, పొగాకు తినబోమని అఫిడవిట్లు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.      

2021 ఏప్రిల్ నుంచి జార్ఖండు సర్కారు ఈ నిబంధనను అమలులోకి తీసుకురానుంది. పొగాకు సంబంధింత పదార్థాలైన సిగరెట్లు, బీడీ, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, జరదా, సుపారి, హుక్కా, ఈ సిగరెట్ వంటి ఉత్పత్తులను ఉపయోగించరాదని, వాటి వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలకూ నష్టమేనని రాష్ట్ర ఆరోగ్య విద్య, కుటుంబ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అందువల్ల అందరూ స్వచ్చందంగా ఈ దుర్వ్యసనాన్ని విడనాడాలని కోరింది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు రంగ కార్యాలయాలు, ప్రధాన ద్వారాల వద్ద పొగాకు రహిత జోన్ అంటూ బోర్డులను ఉంచాలని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.        


గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>